Breaking News

12/06/2019

విలీనం రాజ్యంగబద్దమే


హైదరాబాద్, జూన్ 12  (way2newstv.in)
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో  చేరిన 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం  మీడియాతో మాట్లాడారు. ఎక్కువమంది  ఎమ్మెల్యేలు కోరుకుంటే శాసనసభాపక్షం విలీనం కావొచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని వారు అన్నారు. విలీనం విషయంలో స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ ఎల్పీని టీఆర్ఎస్ లో  విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని అన్నారు. 


విలీనం రాజ్యంగబద్దమే
తమను అనవసరంగా విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.  మరో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కోర్టు నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. రాజ్యాంగంలో 10 వ షెడ్యూల్ను తాము ఉపయోగించుకున్నామన్న ఆయన..తాము కూడా కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు.   టీఆర్ఎస్ లో   విలీనమైనా టీఆర్ఎస్ కండువాను ఇప్పటికీ కప్పుకోలేదని గండ్ర అన్నారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రా రెడ్డి, ఆత్రం సక్కు  సుధీర్ రెడ్డితో కుడా  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment