Breaking News

18/06/2019

తెలంగాణ ఉద్యోగుల జేఏసి కి చిత్తశుద్ది ఉందా?


ప్రశ్నించిన తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటి
హైదరాబాద్,జూన్ 18 (way2newstv.in)
తెలంగాణ ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మిక సంయుక్త కార్యాచరణ కమిటి (జేఏసి) కి ప్రభుత్వం పై పోరాడే చిత్తశుద్ధి ఉందా ? అని తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటి రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షానర్స్ & అధికారుల సంఘాల సంయుక్త పోరాట కమిటి (జేఎస్సి) తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం నేడు జరిగింది.


తెలంగాణ ఉద్యోగుల జేఏసి కి చిత్తశుద్ది ఉందా?
ముఖ్యంగా తెలంగాణ జేఏసి భాగస్వామ్య సంఘాల్లో ప్రధాన సంఘాలకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు , కార్పోరేషన్ ఛైర్మన్ లుగా చలామణి అవుతూ, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని బాహాటంగా ప్రకటించిన నేతల కనుసన్నల్లోనే ఆయా సంఘాలు నడుస్తున్నాయన్నది జగమెరిగిన అక్షరసత్యం. వారిని కాదని ఉద్యోగుల పక్షాన పోరాడే తెగువ , జేఏసి నాయకులకు ఉందా ? అన్న అనుమానాలు ఉద్యోగ , ఉపాధ్యాయుల్లో వ్యక్తమగుచున్నాయని సమావేశం అభిప్రాయపడింది.ఒకవేళ తెలంగాణ ఉద్యోగుల జేఏసి చిత్తశుద్ధితో ఉద్యోగుల పక్షాన పోరాడితే తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ కూడా (జేఎస్సి) వారితో కలిసి పోరాటానికి సిద్ధమని స్పష్టం చేసింది.ఈ నెల 18న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి గారు,ఐఆర్ మరియు తదితర న్యాయపూరిత సమస్యలపై హామీ కాకుండా, ఉత్తర్వులు వెలువరించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో టి జేఎస్సి రాష్ట్ర ఛైర్మన్ తిరువరంగం ప్రభాకర్ , సెక్రెటరీ జనరల్ రవీందర్ రెడ్డి, అరుణ, మసూదుద్దీన్ అహ్మద్ , కేశవకుమార్ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

No comments:

Post a Comment