Breaking News

11/06/2019

ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్


చీపుర్లులతో ర్యాలీగా వెళ్ళీ ఆర్డీవో కార్యాలయం 
ఎదుట ధర్నా, నిరసన 
మున్సిపల్ చైర్మన్ టి. విజయలక్మి –దేవేందర్
జగిత్యాల  జూన్ 11 (way2newstv.in
తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారని  జగిత్యాల మున్సిపల్ చైర్మన్ తాటిపర్తి విజయలక్ష్మి- దేవేందర్ రెడ్డి  విమర్శించారు. ఆమరణ నిరాహార ధీక్షా చేస్తున్న  సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీక్షను బలవంతంగా విరమింప చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇంటి వద్ద నుండి కాంగ్రెస్ నాయకులు చీపుర్లు పట్టుకుని ప్రధాన రహదారిమీదిగా ర్యాలీగా వెళ్ళీ తహసీల్దార్ చౌరస్తా వద్దఉన్న ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా ,నిరసన చేశారు.


ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్
అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను చీపుర్లతో కొట్టాలని, కొనుగోలు చేసిన కేసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని నాయకులు నినాధాలు చేశారు. అరగంటసేపు ధర్నా చేపట్టగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ విజయలక్ష్మి- దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  సంపూర్ణ మెజార్టీ  ఉన్న  కొడుకు కు కాకుండా  అల్లుడు వైపు ఎమ్మెల్యేలు వెళ్తారనే అబధ్రత భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారనీ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేని విధంగా  కేసీఆర్  తెలంగాణలో ఇలా వ్యవహారించడం  క్షమించరానిదని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా , ప్రశ్నించే వారు లేకుండా చేసి ఇష్టం వచ్చినట్లు పాలన సాగించాలని చూస్తున్న  కేేసిఆర్ కు త్వరలో పతనం ఖాయమని పేర్కొన్నారు. .కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, బండశంకర్, గిరి నాగభూషణం , వైస్ చైర్మన్ సిరాజోద్దిన్ మన్సూర్ ,నేహాల్ ,కొత్త మోహన్, గాజుల రాజేంధర్ , దుర్గయ్య, బింగిరవి, పులి రాము, ఎన్నం కిషన్ రెడ్డి, చిట్ల అంజన్న, తోట నరేష్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment