Breaking News

25/06/2019

కొత్త జిల్లాల్లో ఉపాధికి బంద్


మహబూబ్ నగర్, జూన్ 25, (way2newstv.in)
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌ మాత్రమే మున్సిపాలిటీలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదనంగా ఏడు పెద్ద పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చారు. దీంతో విలీన గ్రామాల్లో ఉపాధి పనులు బంద్‌ అయ్యాయి. దానికితోడు మున్సిపాల్టీగా ప్రకటిం చడంతో పన్నుల భారం అధికమైంది. ఉమ్మడి జిల్లాలో 6,77,402 ఉపాధి జాబ్‌కార్డులుంటే, 14,28,092 మంది ఉపాధి కూలీలున్నారు. గతేడాది ఉపాధి పనుల కోసం రూ.1,771 కోట్లు కేటాయిస్తే, రూ.1055 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఏడు మున్సిపాలిటీలతో పాటు పాత మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ.. 32 గ్రామాలను విలీనం చేశారు. దీంతో సుమారు లక్షా 10వేల మంది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చారు.


కొత్త జిల్లాల్లో ఉపాధికి బంద్
మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన వారికి కొత్త ఉపాధి అవకాశాలు కల్పించకపోగా, ఉన్న ఉపాధి పనులు నిలిపేశారు. భూములమ్మినా, కొనుగోలు చేసినా, ఇంటి నిర్మాణం చేయాలన్నా, చివరికి విద్యుత్‌ మీటరు బిగించాలన్నా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగనూల్‌ జనాభా 2300. వీరిలో ఓసీకి చెందిన 40 కుటుంబాలు తప్ప మిగతా వారంతా బీసీ, ఎస్సీ, మైనార్టీలే. ఈ గ్రామంలో 1200 మందికి జాబ్‌ కార్డులున్నాయి. వీరిలో 40 మందికి మాత్రమే ఎకరం, అరెకరా భూమి ఉంది. మిగతా వారంతా సెంటు భూమి లేనివారే. ఇందులో అధిక శాతం తెనుగు సామాజిక తర గతికి చెందిన వారు న్నారు. వారు గతంలో నాగసముద్రంలో చేప లు పట్టుకుని జీవించే వారు. ఇప్పుడు ఆ చెరువు దళారుల చేతు ల్లోకి పోవడంతో వారు కూడా ఉపాధి కోల్పోయారు.నాగర్‌కర్నూల్‌ మున్సిపాల్టీలో ఉయ్యాలవాడ, ఎండబెట్ల గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఈ రెండు గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో చేర్చితే తమకు ఉపాధి లేకుండా పోతుందని కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు గ్రామస్తులకు అనుకూలంగా రాకపోవడంతో మున్సిపాల్టీగా మారింది. దాంతో ఉపాధి లేకపోవడంతో పాటు అదనంగా పన్నులు రుద్దుతున్నారు. అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, ఐజా మున్సిపాల్టీల్లో గ్రామాలు విలీనమయ్యాయి. ఈ విలీన గ్రామాలన్నింటిలోనూ ఉపాధి పనులు సాగడం లేదు.

No comments:

Post a Comment