Breaking News

15/06/2019

అవంతికి తగిన పోస్ట్...


విశాఖపట్టణం, జూన్ 15, (way2newstv.in)
విశాఖనగరానికి ఎన్నో పేర్లు. గత ప్రభుత్వాలు అనేకరకాలైన రాజధానులుగా ఈ ఉక్కునగరాన్ని పోల్చుతూ మునగచెట్టు ఎక్కించాయి. విశాఖను సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధాని, ఆర్హ్దిక రాజధాని, విద్యల నగరమని, తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగిడారు. ఆచరణలో మాత్రం విశాఖ అభివృధ్ధి అడుగు ముందుకు పడలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నగర ప్రగతి నిలిచిపోయింది. నిజానికి పచ్చని కొండలు ఓ వైపు, అందమైన బీచ్ మరో వైపు కలగలసి ఉన్న అరుదైన నగరం విశాఖ. ముఖ్యంగా పర్యాటకరంగం పరంగా ఎంతైనా అభివ్రుధ్ధి చేయాల్సిన సిటీగా చెప్పుకోవాలి.ముఖ్యమంత్రి జగన్ అన్నీ ఆలోచించిన మీదటనే విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు పర్యాటక శాఖను కేటాయించారన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న నాటి పాలకుల మాటలు నీటి మూటలు అయ్యాయి. 


అవంతికి తగిన పోస్ట్...
ఇక రాయలసీమకు చెందిన నాటి మంత్రి అఖిలప్రియ విశాఖలో పర్యాటక పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఓ సారి సమావేశం పెట్టి అంతటితో కధ అయిందనిపించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఏకంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవిని అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ తీసుకువచ్చి కొన్ని కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టించారు. కానీ తరువాత నిధుల లేమితో అవి మూలనచేరాయి. మొత్తానికి విశాఖకు అన్నీ వున్నా అయిదవతనం లేదన్న తీరున పర్యాటకం ఆలా పడకెసిన పరిస్థితి ఉంది.ఇపుడు అరుదైన అవకాశం మంత్రి అవంతికి దక్కింది. పర్యాటక మంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యత విశాఖకే ఇవ్వాల్సిఉంటుంది. విశాఖ భీమిలీ బీచ్ రోడ్ మొత్తం టూరిజం హబ్ గా భారీ ప్రాజెక్టులతో అభివ్రుధ్ధి చేస్తామన్న నాటి ప్రతిపాదనలు అమలు చేయాల్సిన కర్తవ్యం మంత్రికి ఉంది. అదే విధంగా విశాఖ సుందరమైన నగరం. సహజసిధ్ధమైన ప్రక్రుతి ఓ సంపదగా ఉంది. అతి తక్కువ పెట్టుబడితో ఇక్కడ అధ్బుతాలే స్రుష్టించవచ్చునని మేధావులు అంటున్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ ఉంది. విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే మాత్రం టూరిజం అభివ్రుధ్ది చెందడం ఖాయం. అటు భీమిలీ, ఇటు అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ప్రక్రుతి సొగసులను సక్రమమైన ప్రాజెక్టులుగా మార్చుకుంటే నంబర్ వన్ జిల్లాగా విశాఖ ముందుంటుందని అంటున్నారు. ఆర్ధికంగా రాష్రానికి ఆదాయవనరుగా మారడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున యువతకు దక్కుతాయి. కొత్త మంత్రి అవంతి కూడా విశాఖ తన తొలి ప్రాధ్యాన్యత అని చెప్పడంతో ఇపుడు అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి.

No comments:

Post a Comment