Breaking News

04/06/2019

ఖజానాలు ఖాళీ (నెల్లూరు)

నెల్లూరు, జూన్ 4 (way2newstv.in): 
జిల్లాలోని మున్సిపాలిటీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. వనరులు పుష్కలంగా ఉన్నా వినియోగించుకునే సదుపాయం లేక తంటాలు పడుతున్నారు. నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఖాతాలను స్తంభింపజేశారు. పురాలకు వచ్చే రాబడి అంతా ఉన్నతాధికారులు రాష్ట్ర ఖజానాకు చేరేలా చేస్తున్నారు. రూ.కోట్లకు కోట్లు పన్నుల రూపేణా రాబడి ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు పాలకులు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో అభివృద్ధి పనులు సాగడం లేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పురాల ఖాతాల్లోపడే ప్రతి రూపాయిని ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుంటూ స్థానిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని విధంగా నగదును వాడకుండా ఆంక్షలు విధించారు. వెరసి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా పురాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు తిప్పలు పడుతున్నారు.
ఖజానాలు ఖాళీ (నెల్లూరు)
నెల్లూరు కార్పొరేషన్‌, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి పురపాలక సంఘాల్లో కొన్ని నెలలుగా నిధులు వినియోగించే వీల్లేకపోవడంతో పనులు చేయడానికి పాలకులు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి ఖర్చు చేసేందుకు వీల్లేందుకు ఖాతాలను స్తంభింప చేశారు. వసూలు చేసిన నగదు మొత్తం రాజధాని నుంచి ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈఏడాది మార్చి వరకు రూ.700 కోట్ల వసూలు చేశారని తెలుస్తోంది. ఈ నిధులను వేరే పథకాలకు మళ్లించారని సమాచారం. పురపాలకాల ఖాతాలను స్తంభింపజేసి వచ్చిన నిధులను బదిలీ చేసి వినియోగించారు. జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట పురపాలక సంఘాల్లోనూ పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఈ నిధులు మొత్తం రాష్ట్ర ఖజనాకు చేరాయి.మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు రాబడికి మూలమైన దుకాణాల సముదాయాలకు వేలం పాటలు నిర్వహించలేదు. దీంతో కొన్ని చోట్ల మార్చి నెలాఖరు గడువు పూర్తి కావడంతో వేలం పాటలు జరపలేదు. ఎన్నికల నియమావళితో ఇంత వరకూ జరపలేదు. వ్యాపారులు ఖాళీ చేయలేదు. బకాయిలు కోట్లలో రావాల్సి ఉంది. వేలం పాటలు జరపడం ఇంకా ఆలస్యమయ్యే అవకాశముంది. ఇలా రాబడికి గండి పడుతోంది. ఇక మార్కెట్‌ సెస్సు, మత్స్య మార్కెట్‌లకు వేలం పాటలు జరపలేదు.కార్పొరేషన్‌ , పురపాలక సంఘాల్లో కోట్లాది రూపాయల నిధులతో జరగాల్సిన పనులు ఆగాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులు రూ.150 కోట్లకు పైగా నిధులతో పనులు చేయాల్సి ఉంది. వీటిలో కొన్నింటికి టెండర్లు జరగాల్సి ఉంది. పనులు మొదలు కానివి అలాగే ఉన్నాయి. ఇలా పురపాలక సంఘంల్లో ఒక్కో చోట రూ.15 కోట్ల నుంచి రూ.50 కోట్ల పనులు జరగాల్సి ఉంది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో చిన్నచిన్న పనులు చేయలేని పరిస్థితి. నియమావళితో ఎక్కడా పనులు చేయకూడదని నిబంధన పెట్టడంతో ఏ పనీ జరగడంలేదు. జీతాలు, వాహనాలకు ఆయిల్‌ మినహా ఇతర ఖర్చు పెట్టకుండా ఉన్నతాధికారులు పురపాలక శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.నెల్లూరు కార్పొరేషన్‌లో వంద ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో ఏసీడీ నిధులు రూ.70 లక్షలు చొప్పున పురపాలక సంఘాలకు కేటాయించారు. ఈ నిధులతో ట్యాంకర్లు పెట్టి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు కాకుండా శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా పాలనాధికారికి పంపితే ఎన్నికల నియమావళితో అనుమతులు ఇవ్వలేదు. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. వీరికి ఇప్పట్లో నగదు ఇచ్చే అవకాశం లేదు. ఒక్కో పురపాలక సంఘంలో రోజుకు 10 నుంచి 15 ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇదే నిధులతో బావుల తవ్వకం, పాయింట్లు వేసుకునేందుకు అనుమతులు ఇస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశముంది. తాత్కాలికంగా ట్యాంకర్లకు నగదు చెల్లించడంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశముంది. ఒక ట్యాంకర్‌ నీరు తోలి రెంటు ట్యాంకర్లకు బిల్లులు పెట్టి స్వాహా చేసే అవకాశముంది. ఇలా గతంలో ఎంతో నగదు స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి. నాయుడుపేట పురపాలక సంఘంలో శాశ్వత పనులకు ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సాధారణ నిధులు చెల్లించేలా నిర్ణయం తీసుకుని కొత్త పాయింట్లు వేస్తే నాలుగు చోట్ల నీరు అందుబాటులోకి వచ్చింది. ఈ నీటిని పట్టణానికి సరఫరా చేస్తున్నారు. దీంతో కొన్ని ట్యాంకర్లు అద్దెకు పెట్టకుండా నిలిపేశారు.

No comments:

Post a Comment