Breaking News

07/06/2019

ఇవాళ కొలువు దీరనున్న కేబినెట్


విజయవాడ, జూన్ 7, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు కానుంది. వీరందరి చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారంకు 5వేల మంది వస్తారని గుంటూరు జాయింట్ కలెక్టర్ హీమాన్షు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామన్నారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 


ఇవాళ కొలువు దీరనున్న కేబినెట్ 
అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయిశనివారం ఉదయం 9:50 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఉదయం 11:49 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఇక ఉదయం 8:39 గంటలకే సీఎం జగన్‌ తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. 8:42 గంటలకు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు జగన్‌. 8:50 గంటలకు కొన్ని ముఖ్యమైన దస్ర్తాలపై సంతకాలు చేస్తారు. ఆ తర్వాత 9:15 గంటలకు సచివాలయం గ్రౌండ్‌కు చేరుకుని మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. కేబినెట్ లోకి...ఏపీలో 25 మంది కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొలువు దీరనున్న కొత్త మంత్రి వర్గంలో ఎవరికి స్థానం దక్కనుందో అన్న విషయమై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, సుచరిత, పెద్దిరెడ్డి, గౌతమ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. కొత్త మంత్రి వర్గంలో వీరికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నేతల నివాసాల వద్ద వారి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పీడిక రాజన్న దొరను నియమించే అవకాశాలున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment