Breaking News

28/06/2019

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం


జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన
పెద్దపల్లి  జూన్ 28 (way2newstv.in
పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సాధించగలుగుతామని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన  అన్నారు. స్వచ్చ్ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె ఉదయం  పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ నిర్వహించిన స్వచ్చ్ శుక్రవారం  కార్యక్రమంలో పాల్గోన్నారు.  గ్రామాన్ని సంపూర్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్  అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వారికి  పరిశుభ్రంగా ఉంచుకొవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వచ్చే శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలని కోరారు.   గ్రామాలో కొన్ని ఖాళీ ప్రదేశాలలో అధికంగా చెత్త  ఉంటుందని  కలెక్టర్ గుర్తించి సదరు భూ యాజమాన్యులకు వాటిని పరిశుభ్రంగా  ఉంచుకునేలా  నోటీసులు జారీ చేయాలని,  వారి కారణంగా గ్రామస్థులు అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంటుందని, నిర్లకష్యంగా వ్యవహరించిన వారికి జరిమానాలు విధించాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం 

గ్రామస్థులు అంతా ఐక్యమత్యంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  గ్రామాలో స్వచ్చత కార్యక్రమానికి సహకరించని వారిని  గుర్తించి వారికి అవసరమైన అవగాహన కల్పించాలని, ఆ పై సైతం  సహకరించని పక్షంలో  వారికి కరెంట్ కట్ చేసి దారికి వచ్చేలా  చుడాలని  కలెక్టర్ ఆదేశించారు. రాఘవపూర్ గ్రామంలోని  జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన  కలెక్టర్ పాఠశాల క్లాస్ రూంలలోని ఫ్లొరింగ్ నాణ్యత లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత మరమ్మత్తు పనులు  వారం రోజులలో  పూర్తి చేయాలని, నాణ్యతలోపంగా పనులు చేసిన వారి పై చర్యలు తీసుకొవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని వృద్దురాళ్లు తనకు వృద్దాప్య పెన్షన్ రావడం లేదని దరఖాస్తు చేసుకోగా,  ఎంపిడిఒ వెంటనే పరిశీలించి ఆసరా పెన్షన్ కింద మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  అనంతరం రాఘవపూర్ గ్రామ పంచాయతిలో నిర్వహించిన  గ్రామ సభలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   స్వచ్చత మన జీవిన విధానంలొ భాగం  కావాలని,  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని  కలెక్టర్  తెలిపారు.   ఒక  సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం  పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వల్ల  ప్రతి కుటుంబం సంవత్సరానికి రూ.50 వేల ను అనారొగ్యాని బాగుచేయించుకోవడానికి వెచ్చించాల్సి వస్తుందని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే  ఆ డబ్బుతో  అభివృద్ది పనులు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్  తెలిపారు.  గ్రామంలో ఉన్న  చిన్న పరిశ్రమలు అయిన గోదాంలు, రైస్ మిల్లర్ల నుంచి వృద్దా నీరు  బయటికి విడుదల కాకుండా ప్రత్యాహ్నమయ చర్యలు   వారు చేపట్టేలా  సర్పంచ్, పంచాయతి కార్శదర్శి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలోని గ్రామాలో ఇప్పటి వరకు 45 వేల  మ్యాజిక్ సోప్ పిట్ల నిర్మాణం  పూర్తి చేసామని, మరో 35 వేల  సోప్ పిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని  కలెక్టర్  తెలిపరు.  రాఘవపూర్ గ్రామం స్వచ్చంగా ఉండేందుకు సర్పంచ్ తో  పాటు వార్డు సభ్యులు కృషి చేయాలని,   వారు  ప్రతి రోజు సంబంధించిన వార్డులలో   పర్యటిస్తు    పరిశుభ్రత పట్ల ప్రజలకు  నిరంతరం వివరిస్తు ఉండాలని,  గ్రామాలో చెత్తను బయట వేయడానికి వీలు లేదని, అలా చేస్తే భారీ స్థాయిలో వారి పై  జరిమానా విధించాలని  కలెక్టర్ సూచించారు.    ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమయిందని, గ్రామాలో నీటి నిల్వ లేకుండా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  గ్రామాలో   ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడుగుంత,  సోప్ పిట్ నిర్మాణం జరిగేలా  చర్యలు తీసుకోవాలని, మరో  10 రోజుల లోపు విటీ నిర్మాణాలు పూర్తి చేయాలని  తెలిపారు.   గ్రామాలో పడే వర్షపు నీటిని భూమిలో ఇంకే విధంగా అనువైన ప్రదేశాన్నీ సాంకేతిక అధికారుల సహకారంతో గుర్తించి అక్కడ సామూహిక ఇంకుడుగుంతలను నిర్మించాలని,  గ్రామంలో అధికంగా  జనాభా సంచరించే ప్రదేశాలో  సామూహిక మరుగుదొడిని పంచాయతి నిర్మించాలని, దానికి  సంబంధించిన నిధులను  సర్పంచ్ ఖాతాలో  జమ చేయడం జరుగుతుందని, అనంతరం దాని శుభ్రంగా నిర్వహించాల్సిన భాధ్యత పంచాయతికి ఉంటుందని కలెక్టర్  తెలిపారు.  సాముహిక మరుగుదొడ్డి నిర్మించడానకి అనువైన ప్రదేశాన్నీ గుర్తించి  సాయంత్రం వరకు తెలియజేయాలని, మరో 20 రోజులలో  గ్రామంలో సాముహిక  మరుగుదొడ్డి,  ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.  గ్రామాలో ప్లాస్టిక్ వాడకాన్ని  తగ్గించుకోవాలని, దాని వల్ల పర్యావరణానికి చాలా నష్టాలు  ఉంటాయని,  గ్రామాల వాడే ప్లాస్టిక్ ను మరో మారు ఉపయెగించుకునే విధంగా  ప్లాస్టిక్ ను సేకరించి పంచాయతికి  అప్పగించాలని, దీనికి సంబంధించిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని, పంచాయతి ఎప్పటికప్పుడు  ప్లాస్టిక్ ను సేకరిస్తూ వాటిని   విక్రయించాలని కలెక్టర్ సూచించారు.  వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి చుక్కను మనం  నిల్వ చేసుకోవాలని, దానికి అవసరమైన ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, లేని పక్షంలో  మద్రాసు పట్టణానికి వచ్చిన  నీటి కొరత ఇబ్బంది మనకు సైతం వస్తుందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.  పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కుడా చాలా కీలకమని, మనం వ్యక్తిగతంగా కుడా పరిశుభ్రంగా ఉండాలని, మహిళలు నెలసరి సమయాలో  అపరిశుభ్రమైన పాత గుడలు వాడకుండా ఉండాలని, మహిళల కోసం  ప్లాస్టిక్ లేకుండా నాణ్యతతో కూడిన  సబల అనే శానిటరీ న్యాపకిన్లను  పెద్దపల్లి లో తయారు చేస్తున్నామని, వాటిని వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.  గ్రామాలోని పిల్లలకు మనం మంచి పోష్టికాహారం అందించాలని, దాని కోసం ప్రతి ఒకరి ఇంట్లో  పెరటితోట ఎర్పాటు చేసుకోవాలని , దీని కోసం అవసరమైన విత్తనాలను శాసనసభ్యులు  దాసరిమనోహర్ రెడ్డి అందిస్తారని  కలెక్టర్ తెలిపారు. ఈ విషయం పై గ్రామాస్థులకు అవగాహన కల్పిస్తు కార్యచరణ దాల్చే విధంగా కార్యదర్శి చొరవచుపాలని అన్నారు.  హరితహారంలో భాగంగా గ్రామంలో 1 కిలో మిటర్ మేర మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించడం సర్పంచ్, పంచాయతి కార్యదర్శి బాధ్యత అని, దీనికి అవసరమైన ప్రణాళిక రుపోందించుకోవాలని తెలిపారు.  గ్రామంలోని ప్రతి ఇంట్లో మొక్కలను పెంచాలని, అదే విధంగా  ప్రతి ఇంటి ముందు నాటే మొక్కలను సంరక్షించుకునే బాధ్యత సదరు  ఇంటి వారు తీసుకోవాలని,  చెట్లను పెంచకుంటే భవిష్యత్తులో  స్వచ్చమైన గాలిని  కొనుగొలు చేసే దుస్థితి వస్తుందని, దానిని నివారించడానికి  ప్రస్తుతం అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  స్వచ్చ్ శుక్రవారం  కార్యక్రమానికి హాజరుకాని గ్రామస్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్,జిల్లా పౌరసంబంధాల అధికారి వి.శ్రీధర్,  పెద్దపల్లి ఎంపిడిఒ రాజు,  రాఘవపూర్ గ్రామ సర్పంచ్ ఆడ్యపు వెంకటేశ్,  గ్రామ అధికారులు,  గ్రామస్థులు , సంబంధిత అధికారులు తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:

Post a Comment