Breaking News

27/06/2019

తెరపైకి కేఏ పాల్


హైద్రాబాద్, జూన్ 27 (way2newstv.in)
కె.ఏ.పాల్…ఇతని గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. అతని చేష్టలు, అతని మాటలు వింటే ఇప్పటికి నవ్వుతూనే ఉంటాం. పైగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయిన పాల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. కాగా త్వరలోనే పాల్ సినిమాతో కూడా నవ్వించబోతున్నాడు. కాకపోతే అతను నటించట్లేదు. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓ కమెడియన్ ఆయన పాత్ర చేయనున్నాడు.ఆ పాత్ర ఎవరో కాదు వేసేది. కమెడియన్ సునీల్..పాల్ పాత్ర లో కనిపించనున్నాడు.

తెరపైకి కేఏ పాల్
పొలిటిక‌ల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కొత్త డైరెక్ట‌ర్ దర్శకత్వం వహిస్తున్నారని.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? అసలు నిజంగానే సునీల్ ఈ పాత్ర చేస్తున్నాడా? ఒకవేళ చేస్తే పాల్ పాత్రలో సునీల్ ఎలా మొప్పిస్తాడో..? ఇంతకీ ఈ సినిమా పై మన ఇంటర్ నేషనల్ పాల్ ఏలా స్పందిస్తాడో..! అన్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి.తాజా సమాచారం ప్రకారం ఈమూవీ లో సునీల్ తో పాటు ఇద్దరు నటీమణులు నటించే అవకాశం వుందట. ఈసినిమా పేరేంటి? డైరెక్టర్ పేరేంటి అనేది తెలియాల్సిఉంది. త్వరలోనే ఈమూవీ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

No comments:

Post a Comment