Breaking News

05/06/2019

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి


జగిత్యాల జూన్ 5 (way2newstv.in)
జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో లో ఆర్యవైశ్య సంక్షేమ సంఘం గోవిందు పల్లె అధ్యక్షుడు పబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో   స్థానిక పట్టణ తహసీల్దార్ చౌరస్తా నుండి టవర్ ప్రాంతం వరకు ర్యాలీ చేపట్టి ప్లాస్టిక్ వాడకం నిషేదించాలనే కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నుండి ప్లాస్టిక్ వద్దు జ్యుట్ బ్యాగ్స్ వాడాలని సంకల్పంతో 500 జ్యుట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.  


ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడాతూ రోజు రోజుకూ కాలుష్యం విపరీతంగా  పెరిగి పోతుందని, దాన్ని వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అడవులను నరికి వేయడం వలన, అనేక పరిశ్రమలు నెలకొల్పడం వలన, పచ్చని పంట పొలాలను ఇంటి స్థలాలుగా మార్చడం వలన, ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగించడం ద్వారా, వాహనాలు ఎక్కువగా వినియోగించడం ద్వారా ఇవన్నీ పరిణామాలచే పర్యావరనానికి తీవ్ర నష్టం జరిగి భూమిపై విపరీతమైన ఉస్నోగ్రతలు పెరుగుతున్నాయి అన్నారు అందుకే ప్రతి ఒక్కరు చెట్లను నాటి పర్యావరనాని కపడలన్నారు. మరియు జీవరాసులు, ముగజీవులు ఈ ప్లాస్టిక్ వాడకం వలన అంతరించి పోతున్నాయి అన్నారు. నేలపై కరిగి పోనీ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి  జ్యుట్ బ్యాగులను ప్రతి ఒక్కరు వాడాలని ఈ సందర్భంగా సూచించారు.

No comments:

Post a Comment