Breaking News

12/06/2019

తండ్రి ఉద్యోగాలు ఇచ్చాడు.. కొడుకు జీతాలు పెంచాడు


జీతాల పెంపు పై ఆశ వర్కర్లు సంబరాలు 
కర్నూలు జూన్ 12  (way2newstv.in)
కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోప్రజల అందుబాటులో ఉంటూ 24గంటల వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవనకొండ బస్టాండ్ ఆవరణం  లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాల వేశారు. మూడు వేల నుండి 10000 ఒకేసారి జీతాలు పెంచినట్లు ప్రకటించడంతో కర్నూలు జిల్లా దేవనకొండ లో ఆశా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉండే వారిని ఆశా కార్యకర్తలు గా సెకండ్ ఏఎన్ఎం లుగా నియమించారు గతంలో ఆశ వర్కర్లకు రూ 500 సెకండ్ ఏఎన్ఎం నాకు నాలుగు వేలు జీతం ఇచ్చారు 


తండ్రి ఉద్యోగాలు ఇచ్చాడు.. కొడుకు జీతాలు పెంచాడు 
అయితే ప్రస్తుతం ఆశ కార్యకర్తలకు రూ 10000 ఒకేసారి పెంచుతున్నట్లు ప్రకటించడంతో వారి ఆనందానికి హద్దులే లేకపోయింది ప్రస్తుతం ఆశ వర్కర్లు కార్యకర్తలు గ్రామాలలో మాతా శిశు సంరక్షణకోసం వారు కృషి చేయనున్నారు గర్భిణీలకు నెల నెల గా ఆస్పత్రులకు తీసుకొచ్చి వైద్యుల చేత చికిత్స చేయించి కాన్పు అయ్యేంతవరకు చూసుకునే బాధ్యత ఆశ వర్కర్ల ది మండలాలు ,గ్రామాల్లో ఆశ వర్కర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో తాము కలిశామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు తమకు జీతాలు పెంచడం జరిగిందని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తులసి శాంతి డాక్టర్ మాదన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ (కిట్టు ) వైకాపా మండల కన్వీనర్ లుముంబా మండల కో కన్వీనర్ కబీర్ ,వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, వెంకటస్వామి, వెలమకూరు రామచంద్ర, గడ్డం రంగన్న,తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment