కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ జూన్ 3(way2newstv.in)
ఢిల్లీలోని మహిళలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా రవాణా వాహనాల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. మెట్రోరైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా, మహిళల భద్రత, సౌలభ్యం దృష్ట్యా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. మహిళల ప్రయాణ ఖర్చులు ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది.
ఢిల్లీలోని మహిళలకు ప్రజా రవాణా వాహనాల్లో ఉచిత ప్రయాణం
ఈ విషయమై కేంద్రం అనుమతి అవసరం లేదని ఆయన వెల్లడించారు.స్థోమత గల మహిళలు టికెట్ తీసుకోవడం వల్ల ఇతరులకు లబ్ధి చేకూరుతుంది. విధానం అమలుపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెండు, మూడు నెలల్లో ఈ విధానం అమలుకు కృషి చేస్తామన్నారు. కొత్త విధానం అమలుపై ప్రజాభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఉచిత ప్రయాణ రాయితీ భారం ప్రజలపై మోపబోమని ప్రకటించారు.
No comments:
Post a Comment