Breaking News

18/06/2019

హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నా: చంద్రబాబు


అమరావతి జూన్ 18 (way2newstv.in)
టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదంటూ ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. 'ప్రత్యేక హోదా' పేరుకు ఆర్థిక సంఘం ఒప్పుకోకపోవడంతో పేరు మార్చి 'ప్రత్యేక ప్యాకేజి'గా ప్రకటించారని, హోదాకు సమానమైన ప్యాకేజి ఇస్తామంటేనే తాను ఒప్పుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తానెప్పుడూ రాజీపడలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశానని వివరించారు. 


హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నా: చంద్రబాబు
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం చేసే ప్రయత్నాలకు అన్నివిధాలుగా సహకరిస్తామని చంద్రబాబు వెల్లడించారు. కాగారాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కావాలని ఐదు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లోఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని ప్రజలు కోరుకోవడం వల్లే ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని అన్నారు. కనుక, ‘హోదా’ను కచ్చితంగా సాధించాలని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సూచించారు. 

No comments:

Post a Comment