Breaking News

06/06/2019

పాలమూరు ఆవాసాలకు అందని నీరు


మహబూబ్ నగర్, జూన్ 6, (way2newstv.in)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 362123 గ్రామీణ జనాభాతో పాటు 6లక్షల పట్టణ జనాభా ఉంది. వీరికి ప్రతి రోజు ఒక మనిషికి 100లీటర్ల సరఫరా చేయాల్సి ఉంది. అంటే ప్రతి రోజు 46 కోట్ల లీటర్ల నీటిని జిల్లాకు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుత వనరులను పరిశీలిస్తే 15కోట్ల లీటర్లకు మించి సరఫరా కావడంలేదు. జిల్లాలో 6147 మంచినీటి వనరులు ఉండగా 3434 కిలో మీటర్ల పంపింగ్‌ చేస్తున్నారు. 4091 కిలోటర్ల డిస్ట్రీబ్యూషన్‌ కాల్వలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2765 ట్యాంకులు ఉండగా 43 సంపులు ఉన్నాయి. 5141 పంపుసెట్లు  13949 చేతి పంపులు ఉన్నాయి. గత సంవత్సరం 1149 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీరు అందించక 2091 ఆవాసాలకు పాక్షికంగా నీరు అందుతోంది. 177 ఆవాసాలకు అసలు నీరు అందించడం లేదు. 


పాలమూరు ఆవాసాలకు అందని నీరు
గతేడాది నీళ్లకోసం 341 వాటర్‌ ట్యాంకర్లతో 165 అద్దెబోర్లతో నీటిని సరఫరా చేశారు.డ్రై అయిన 201 బోర్లను క్రషింగ్‌ చేసి 276 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. ప్రయివేట్‌ అద్దె బోర్లతో మరో 273 గ్రామాలకు తాగునీటిని అందించారు. ఈ సారి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే గతేడాది మాదిరిగానే తాగునీటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ముఖ్య పట్టణాలైన నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, తెల్కపల్లి, బిజినపల్లి, నారాయణపేట, జడ్చర్ల ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి బలంగా ఉంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌ర్నూల్‌ ప్రాంతాలలో 15 రోజులకు ఒకసారి నీళ్లు వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే రామన్‌పాడు, జూరాలా రిజర్వాయర్లు ఒట్టి పోతున్నాయి. ఎండలు ముదురితే తాగునీటికి తిప్పలు పడే అవకాశాలు ఉన్నాయి. బిజినపల్లి, తెల్కలపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. గతంలో అనేక సార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైన అధికారులు స్పందించి వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా చూడాలని పలు పార్టీలు కోరుతున్నాయి. తాగునీటి సమస్య రాకుండా పాలకులు అన్ని విధాల చర్యలు తీసుకోవాలి. భగీరథ పేరుతో పాలకులు కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని భగీరథ గురించి మాట్లాడుకోవడం సరికాదని ప్రజా సంఘాలు కోరుతున్నాయి...

No comments:

Post a Comment