Breaking News

06/06/2019

జ్యూడిషియల్ కమిషన్ చారిత్రాత్మక నిర్ణయం


విజయవాడ, జూన్ 6, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు సాహసోపేత నిర్ణయం. కొన్ని సందర్భాల్లో విశ్రాంత జడ్జిలతో విచారణ చేయించడం చూశాం. 


జ్యూడిషియల్ కమిషన్ చారిత్రాత్మక నిర్ణయం
ఇప్పుడు నిరంతర స్క్రూటిని ఉంటుంది. జగన్‌ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందో చిన్న ఉదహరణ ఇది అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం జగన్‌ మంగళవారం కలిసి సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీలో టెండర్ల ప్రకియలో పారదర్శకత కోసం జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు న్యాయ వివాదాలు లేకుండా అరికట్టవచ్చని ముఖ్యమంత్రి చీఫ్‌ జస్టీస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పర్యవేక్షక కమిటీ కోసం సిట్టింగ్‌ జడ్జీని ఒకరిని కేటాయించాలని జగన్‌ కోరినట్లు సమాచారం. 

No comments:

Post a Comment