Breaking News

12/06/2019

కార్పొరేట్ ఆస్పత్రులు గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్, జూన్ 12  (way2newstv.in)
పేద,బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ఎంతగానో కృషిచేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలో  వైద్యం కోసం తమిళనాడు, కేరళ తరువాత ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే, అధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది ఒక్క కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. అందులో భాగంగా సిటీలోని ప్రభుత్వ నేచర్ క్యూర్, హోమియో పతి ఆస్పత్రి,, నిలోఫర్,సరోజిని కంటి ఆస్పత్రి,, ఉస్మానియా లతోపాటు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రులను అయన మంత్రి సందర్శించారు. 


కార్పొరేట్ ఆస్పత్రులు గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం
అక్కడి ఆస్పత్రులల్లో ఉన్న సమస్యల గురించి, వైద్యం, శానిటేషన్ మరియు వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిపేయిర్ లో డయాగ్నిక్ సెంటర్లను పరిశీలించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వారం పది రోజులల్లో పూర్తీ చేసుకొని రోగులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు.అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే పెద్ద ఆసుపత్రుల పై భారం పడకుండా జిల్లా, గ్రామీణ, ఏరియా ఆసుత్రులను ఇప్పటికె కొన్ని జాగలల్లో ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. వాటిని అధిక స్థాయిలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందించే విదంగా కృషి చేస్తామని అన్నారు. ఏరియా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం వల్ల గాంధీ, ఉస్మానియా వంటి పెద్దా ఆస్పత్రులకు భారం తగ్గుతుందని అన్నారు.

No comments:

Post a Comment