Breaking News

24/06/2019

టార్గెట్ 60 దిశగా అడుగులు


కమలం ఉచ్చులో కాంగ్రెస్ 
హైద్రాబాద్, జూన్ 24, (way2newstv.in
2023లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునే దిశగా కసరత్తు మొదలెట్టింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ చావుదెబ్బ తిన్నది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను బిజెపి సాధించింది. టిఆర్‌ఎస్ బలంగా ఉన్న నాలుగు స్థానాలను కమలం తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో తెలంగాణలో బలపడేందుకు బిజెపికి ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపి తీర్థం తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి కూడా కమలంలోకి పునరాగమనం చేయడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. వీరితోపాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. మరోవైపు వాస్తవానికి వీరు పార్టీ మారిన పదవులకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. బిజెపి ఉచ్చులో టిడిపి, కాంగ్రెస్ నేతలు పడినట్లుగా తెలుస్తోంది. కమలం పార్టీ పన్నిన వ్యూహంలో చిక్కుకుని పెద్దఎత్తున ఆయా పార్టీల నేతలు వలసపోతున్నారు. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.


టార్గెట్ 60 దిశగా అడుగులు
అదే బాటలో మరో పన్నెండు నుంచి పదిహేను మంది ఎపికి చెందిన టిడిపి శాసనసభ్యులు కూడా బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన నేతలను కూడా గుర్తించి వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కమలనాధులు వ్యూహాలకు పదనుపెడుతున్నారు. అందులో కర్నూల్ జిల్లా నుంచి కోట్ల కుటుంబం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే వివిధ జిల్లాల్లోని టిడిపికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలతో పాటు పలువురు నేతల పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది.తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని బిజెపి అమలు చేస్తోంది. ఇక్కడ కూడా పార్టీని మరింతగా విస్తరింప చేయాలన్న లక్షంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై కన్నేశారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను బిజెపిలో చేర్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా కాషాయ గూటికి తీసుకవచ్చేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు మరికొంత మంది నేతలపై కూడా వల వేసినట్లుగా రాజకీయవర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కమలంను పటిష్టం చేసుకునేందుకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. ఎపిలో బిజెపి సంస్థాగతంగా బాగా బలహీనంగా ఉంది. తెలంగాణ తెలంగాణలో మాత్రం సంస్థాగతంగా కొంత మేరకు బలంగానే ఉంది. ఈ నేపధ్యంలో మరింత బలపడేందుకు కాషాయ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.సాంకేతికంగా చూస్తే వీరు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం సిఎల్‌పిని అధికారికంగా టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో వీలినం అయింది. దీంతో వీరు పార్టీ మారినా అనర్హత వేటు వేసేందకు వీలు ఉండకపోవచ్చు. అలాగే కలిసివచ్చే మరికొందరు నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఇక ఎపి విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. దాదాపు అభ్యర్థులందరూ డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. ఈ దశలో పార్టీ బలపడటం కంటే అధికారికంగా బలం పుంజుకునేందుకు నిర్ణయించింది.

No comments:

Post a Comment