Breaking News

14/06/2019

3500 స్కూళ్లు మూసివేత దిశగా అడుగులు

హైద్రాబాద్, జూన్ 14, (way2newstv.in)
రాష్ట్రంలో మూడున్నర వేల సర్కారు బడుల మూతకు రంగం సిద్ధమైంది. విద్యార్థులు తక్కువగా ఉన్న బడుల్లోని స్టూడెంట్లను దగ్గర్లోని బడుల్లో చేర్పించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో డీఈవోలు చర్యలు చేపట్టారు. తక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్ల లెక్కలు తీయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పది మంది లోపు స్టూడెంట్లున్న ప్రైమరీ స్కూళ్లు, 20 మందిలోపున్న యూపీఎస్లు, 30 మందిలోపున్న హైస్కూళ్లలోని స్టూడెంట్లను సమీపంలోని సర్కారు బడుల్లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఆ స్కూళ్లలోని టీచర్లను అవసరమైన స్కూళ్లకు పంపనున్నారు.రాష్ట్రంలో మొత్తం 26,054 ప్రభుత్వ, లోకల్‌‌ బాడీ స్కూళ్లుండగా.. వాటిల్లో 21 లక్షల మంది వరకు స్టూడెంట్లు చదువుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని వందలాది స్కూళ్లలో స్టూడెంట్లు తక్కువగా ఉన్నారు. 

3500 స్కూళ్లు మూసివేత దిశగా అడుగులు
వాటిలో స్టూడెంట్లను చేర్పించే ప్రయత్నాలేవీ పెద్దగా జరగలేదు. పైగా ఏటా స్టూడెంట్స్‌‌ సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు గురుకులాల సంఖ్య పెరగడం కూడా ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలోనే తక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్లను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కిందే నిర్ణయించింది. జనం, టీచర్ యూనియన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా ఈ అంశంపై ముందుకు వెళుతోంది.రాష్ట్రంలో పది మందిలోపే స్టూడెంట్లున్న ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 3 వేల వరకు ఉన్నట్టు అంచనా. 20 మందిలోపున్న అప్పర్‌‌ ప్రైమరీ, 30లోపు స్టూడెంట్లున్న హైస్కూళ్లు కలిపి 500 వరకు ఉన్నాయి. వీటన్నింటి నుంచి స్టూడెంట్లను సమీపంలోని బడులకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం బడిబాట కార్యక్రమంపై డీఈవోలు, ఎంఈవోలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌‌రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో డీఈవోలు ఎంఈవోలకూ ఆదేశాలిచ్చారు. మరోవైపు గతేడాది సుమారు 600 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదు. వాటిల్లోని టీచర్లనూ డిప్యూటేషన్పై వేరే బడులకు పంపారు. దాంతో అవి గతేడాదే తాత్కాలికంగా మూతపడగా.. ఈసారీ తెరిచే అవకాశం కనిపించడం లేదు.విలీనం చేయదలిచిన 3,500 బడుల్లో 30 వేల మంది వరకు స్టూడెంట్లు,10 వేల మంది వరకు టీచర్లు ఉంటారని అంచనా. వారిని ఎలా వేరే బడుల్లోకి మారుస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్‌‌కొక ప్రైమరీ, మూడు కిలోమీటర్లకు ఒక యూపీఎస్‌‌, ఐదు కిలోమీటర్లకొక హైస్కూల్‌‌ ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్లు తక్కువున్న స్కూళ్లను మూసేస్తే.. చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని టీచర్ యూనియన్లు చెప్తున్నాయి.

No comments:

Post a Comment