Breaking News

18/06/2019

30లోపు ఆస్తిప‌న్ను చెల్లించాలి


జులై 1 నుండి రెండు శాతం జ‌రిమానా
హైదరాబాద్,జూన్ 18 (way2newstv.in)
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌ర ఆస్తిప‌న్నును జ‌రిమానా లేకుండా చెల్లించేందుకు మ‌రో రెండు వారాల‌లోపే   గ‌డువు మాత్ర‌మే ఉన్నందున జూన్‌ 30వ తేదీలోపు ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌ విజ్ఞ‌ప్తి చేశారు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను 14,50,000 మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారులు ఆస్తిప‌న్ను జీహెచ్ఎంసీకి చెల్లించాల్సి ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 6,77,119 ప‌న్ను చెల్లింపుదారులు రూ. 592 కోట్ల‌ను చెల్లించారని తెలిపారు. ఇప్ప‌టికీ చెల్లించ‌ని వారు త‌మ ఆస్తిప‌న్నును జూన్ 30వ తేదీలోపు చెల్లించాల‌ని, లేన‌ట్టైతే జూలై 1వ తేదీ నుండి రెండు శాతం పెనాల్టి విధించ‌డం జ‌రుగుతుంద‌ని  క‌మిష‌న‌ర్  తెలిపారు. 


30లోపు ఆస్తిప‌న్ను చెల్లించాలి
ఆస్తిప‌న్ను వ‌సూల‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించాల‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. న‌గ‌రంలో స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలకు భంగం క‌లిగిస్తున్న‌, నిషేదిత 50మైక్రాన్ల క‌న్నా త‌క్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను విక్ర‌యించే, ఉప‌యోగించేవారికి జ‌రిమానాల‌ను విధించాల‌ని సూచించారు. సంపూర్ణ స్వ‌చ్ఛ‌త సాధ‌న‌కై చేప‌ట్టిన సాఫ్ హైద‌రాబాద్ - షాన్‌దార్ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం మున్సిప‌ల్ ప‌రిపాల‌న‌లో వినూత్న కార్య‌క్ర‌మ‌మ‌ని, ఈ కార్య‌క్రమాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌ల‌య్యేలా డిప్యూటి, జోన‌ల్  క‌మిష‌న‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. సాఫ్‌, షాన్‌దార్ హైద‌రాబాద్ నిర్వ‌హ‌ణ పై త్వ‌ర‌లోనే న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో స‌మీక్ష స‌మావేశం జ‌రుగ‌నుంద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్లు, ఏరియా, వార్డు క‌మిటీ స‌భ్యుల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని సూచించారు. న‌గ‌రంలో నీటిని వృథాను అరిక‌ట్ట‌డం, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై గుర్తించిన‌ వాలెంటీర్ల‌ను జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటుచేస్తున్న‌ట్టు  తెలిపారు. జీహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ముఖ్యంగా కేసుల‌న్నింటికి కౌంట‌ర్ల‌ను దాఖ‌లు చేయ‌డంతో పాటు ఈ కోర్టుకేసుల‌పై ప్ర‌తివారం స‌మీక్షించాలని డిప్యూటి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. 

No comments:

Post a Comment