Breaking News

15/06/2019

తెలంగాణ బీసీ జాబితాలో మరో 30 కులాలు


హైద్రాబాద్, జూన్ 15(way2newstv.in)
రాష్ట్రంలో పలు కులాలను బిసి జాబితాలో చేర్చేందుకు అవసరమైన చర్యలకు రాష్ట్ర బిసి కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. కులాల వారీగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పది రోజుల పాటు ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి నట్లు కమిషన్ ఛైర్మన్ డాక్టర్ బిఎస్.రాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తమను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలని రాష్ట్రంలోని పలు సంఘాలు ఇప్పటికే బిసి కమిషన్‌కు విన్నవించాయని తెలిపారు. ఇప్పటి వరకు 30 కులాల ప్రతినిధులు తమను బిసిలో చేర్చాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలను కూడా అందించారన్నారు. ఈ నేపథ్యంలో బిసి నిర్థిష్టంగా ఇందుకోసం ఒక ప్రణాళికలను రూపొందించిందన్నారు.ప్రధానంగా బిసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసిన కులాలకు సంబంధించిన అదనపు డేటా, సామాగ్రి, సాక్షాలతో కమిషన్ ముందుకు రావాలని సూచించింది. 


తెలంగాణ బీసీ జాబితాలో మరో 30 కులాలు
ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కులాల వారీగా తమకు సంబంధించిన జాబితాను సమర్పించాలని కమిషన్ సూచించింది. బిసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసిన కులాల్లో కాకి పడగల, మందెచ్చుల, సన్నాయోలు, బత్తిన, కుల్ల కడిగి, బైల్ కమ్మర, బాగొతుల, బొప్పల, తోలుబోమ్మలాట, గంజికూటి, శ్రీ క్షత్రియ రామజొగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోల్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం వారు, సాధనా శూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల వారు, గౌడజెట్టి, ఆది కొడుకులు, తెర చీరల, సారోళ్లు, అరవ కొమటి, అహీర్ యాదవ్, గొవిలి తదితర కులాలున్నట్లు తెలిపారు. 17 నుంచి ఆయా కులాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉదయం పదకొండున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రతి కులానికి ఒక గంట చొప్పున సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ నెల 17వ తేదీన కాకి పడగల, మందెచ్చుల, సన్నాయోలు, కుళ్ల కడిగి 18వ తేదీన బెయిల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తొలుబొమ్మలాట వారు, తెర చీరల, 19వ తేదీన గంజికూటి వారు, శ్రీక్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు వారు, 20వ తేదీన అడ్డపు వారు, కడారి సైదరోల్లు, సరగాని, ఓడ్, 21వ తేదీన మాసయ్యలు /పటం వారు, సాధన శూరులు, రుంజ, ఆది కొడుకులు, పాపల, 22వ తేదీన పనస, పెక్కర, పాండవుల వారు, గౌడజెట్టి, 24వ తేదీన సారోల్లు, అరవ కోమటి, అహీర్ యాద వ, గోవలి, 25 నుంచి 27వ వరకు వివిధ కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం రాని కులాలకు చెందిన ప్రతినిధులు ఈ రెండు రోజుల్లో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.

No comments:

Post a Comment