Breaking News

24/06/2019

అందుబాటులోకి మీ సేవ 2.0


వరంగల్,  జూన్ 24, (way2newstv.in)
మీ సేవ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇకపై అన్ని పౌర సేవలను ఒక్క క్లిక్‌తోనే పొందవచ్చు. ఇందుకు ప్రభుత్వం అందబాటులో తెచ్చిన మీ సేవ 2.0 వెర్షన్‌లో లాగిన్ అయితే చాలు. అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 37 రకాల సేవలను నేరుగా లాగిన్ అయి పొందవచ్చు.అంతకు ముందు పౌర సేవలు పొందాలంటే మీ సేవ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో ఇంటి నుంచే ఈ సేవలు పొందే సదుపాయం కలుగుతుంది. కులం, ఆదాయం, జనన, మరణ పత్రాలతో పాటు మొత్తం 37 రకాల సేవలు పొందవచ్చు. మీ సేవా కేంద్రాలు బిజిగా ఉన్నా, మూసి ఉంచినా ఎన్నో సమస్యలు ఎదరవుతుండేవి. సర్టిఫికెట్లు అత్యవసరమైన వారి బాధలు వర్ణనాతీతం. ఇలాంటి సమస్యలకు ఇక చెక్ పడనున్నది. ఐటిశాఖ ఇటివల మీ సేవ 2.0 వెర్షన్‌ను రూపొందించింది. 


అందుబాటులోకి మీ సేవ 2.0
దీని ద్వారా సర్టిఫికెట్‌తో పాటు బిల్లు చెల్లింపులు సైతం ఇంటి నుంచే ఆన్‌లైన్ చేసుకోవచ్చు.మీ సేవ 2.0 వెర్షన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కంప్యూటర్ లేదా స్మోర్ట్‌ఫోన్‌లో మీ సేవ వెబ్‌సైట్ లోకి వెళ్లి 2.0 సిటిజన్ సర్వీస్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత వ్యక్తి పేరు, తండ్రిపేరు. అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఈ ఐడీ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి 37, రకాల పౌర సేవలను పొందవచ్చును. ఏదైన సర్టిఫికెట్ కావలంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తులను పొందవచ్చును. టీ వ్యాలెట్, డెబిట్, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్ ద్వారా ఏ మోడ్‌లోనైన సంబందిత రుసుం చెల్లించవచ్చు. ఆప్లికేషన్ అప్రూవ్‌కాగానే సదరు వ్యక్తికి మొబైల్‌కు మేసేజ్ వస్తుంది.కొత్తగా ప్రారంభించిన మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా పౌర సేవలన్నింటినీ పొందవచ్చు. ఈ యప్‌లో కులం, నివాసం, ఆదాయం, జనన, మరణ, ద్రువీకరణ పత్రాలను పొందే వెనులుబాటు ఉంది. అపద్బందు, స్కాలర్‌షిప్, పొందే వెనులుబాటు కుడా ఉంది. కరెంట్ బిల్లు, ఫోన్‌బిల్లు, ఇతర పన్నుల చెల్లింపు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల దర్శనం టికెట్ల బుకింగ్ తదితర సేవలు కూడా ఇంటి నుండే పొందవచ్చు 37 రకాల పౌర సేవలతో పాటు మొత్తం అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 278 రకాల సేవలు కూడా పొందేందుకు మీ సేవ 2.0 వెర్షన్‌లో అవకాశం ఉంటుంది. అన్‌లైన్ దరఖాస్తులో ఏమైన సందేహాలు, సమస్యలు తలెత్తితే పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100, 1800 4251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment