Breaking News

04/05/2019

ఉదయం పదైతే నిర్మానుష్యమే

అనంతపురం, మే 4, (way2newstv.in)
సూర్యుడి ప్రతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏటా మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ఏప్రిల్‌లోనే ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో వాతావరణం ఉదయం నుంచే వేడుక్కుతోంది.ఎండలు వేడి పుట్టిస్తుండడంతో మ ధ్యాహ్న సమయంలో రోడ్లతోపాటు ప్ర ధాన ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉం డే వైవీ స్ట్రీట్‌ మొదలుకొని నగరంలోని వీధులు కూడా జనం లేక వెలవెలబోతున్నాయి. 


ఉదయం పదైతే నిర్మానుష్యమే

ఎండ దెబ్బకు భయపడి అధికా రులు కూడా మధ్యాహ్న భోజనాన్ని కార్యాలయాలకే తీసుకెళుతున్నారు.ఎండ ప్రభావానికి తోడు వడగాలులు జనాలను భయాం దోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడూ లేని తరహాలో ఎండలు పెరగడం.....దీనికితోడు గాలలు వీస్తుండడంతో వడగాలుల ప్రభావంతో ప్రజలు భయపడుతున్నారు. ఎండ సెగ ధాటికి మధ్యాహ్నమైతే ఇంటికే పరిమితం అవుతుండగా పల్లె ప్రాంతాల్లో చెట్ల కింద సేద తీరుతున్నారు.  వడగాలుల నేపధ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వారం రోజులుగా జిల్లా ప్రజలు ఉడుకుతో అల్లాడుతున్నారు. సూర్య ప్రతాపానికి కడప కాలిపోతోంది. బయటికి రావాలంటేనే ముఖం మీద చెంపలకు చేతులు అడ్డుపెట్టుకుని...తలపై బట్ట వేసుకుని బయట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా ప్రతిరోజు 40కు పైగానే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఏప్రిల్ నెలలో  18 నుంచి 41 నుంచి దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

No comments:

Post a Comment