హైదరాబాద్, మే 3 (way2newstv.in)
పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కాపాడుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భాగవత్ అన్నారు. ఈ రోజు నేరేడ్మెట్ లోని రాచకొండ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో పోలీసుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ డిస్పెన్సరీని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. అనంతరం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాబోదీ ఫంక్షన్ హాలులో మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో మల్కాజిగిరి జోన్ పోలీసులు, వారి కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పోలీసులు, వారి కుటుంబసభ్యులు హెల్త్ చెకప్ చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి...సీపీ మహేష్ భగత్
బ్లడ్ ఫ్రెషర్, కార్డియాలజీ, కంటి, డెంటల్, ఆర్థోపెడిక్ తోపాటు పలు రకాల వ్యాధులకు సంబంధించిన చెకప్ లు చేసుకొని మందులు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రతీ పోలీసు స్టేషన్ కు ఒక మెడికల్ కిట్ అందిస్తామని తెలిపారు. పోలీసులు నిత్యం పోలీసు వృత్తిలో భాగంగా వృత్తిపరమైన అనేక మానసిక, శారీరక ఒత్తిడి, సమయానికి తిండి, నిద్రలేక రోగాలబారిన పడే అవకాశముందని ఆయన అన్నారు. మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి, ఎఫ్ యమ్ యెస్ (FMS డెంటల్), అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ కు హాజరైన పోలీసులు, వారి కుటుంబసభ్యులందరూ చెకప్ చేయించుకుని వైద్యులు ఇచ్చిన మందులు వాడి, వారి సలహాలు, సూచనలు పాటిస్తూ తమ తమ ఆరోగ్యాలను రోగాలబారిన పడకుండా, నిరంతరం ఫిట్ గా, దేహదారుధ్యంతో ఉండేందుకు కృషి చేయాలని సీపీ మహేష్ భగవత్ పోలీసులకు సూచించారు. దాదాపు 215 మంది వైద్య అందుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ మల్కాజిగిరి ఉమా మహేశ్వర శర్మ, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శిల్పవల్లి, ఏసీపీలు, మల్కాజిగిరి జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సిఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, సభ్యులు కృష్ణ రెడ్డి, పోలీసు డిస్పెన్సరీ డాక్టర్ సరితా, మాక్స్ క్యూర్, ఎఫ్ఎమ్ఏస్ డెంటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment