హైదరాబాద్, మే 6, (way2newstv.in)
తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనను ఖరారు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ ముందుగా కేరళకు వెళ్లారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనలో ఈ రెండు వారాల పాటు కేసీఆర్ బిజీబిజీగా గడపనున్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్తో ఆయన నివాసంలో సమావేశమవుతారు.
కేరళ, తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్
దేశ రాజకీయాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికలు, తదనంతరం తలెత్తే పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సోమవారం ఉదయం సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
No comments:
Post a Comment