Breaking News

02/05/2019

అందుబాటులోకి మరో టీటీడీ వసతి సముదాయం

తిరుమల, మే 2, (way2newstv.in)
తిరుమలలో మరో విశాలమైన ఉచిత వసతి సముదాయం భక్తులకు అందుబాటులోకి రానుంది. తిరువేంకటపథం రింగురోడ్డుకు సమీపంలో ఉన్న మూడో యాత్రీసదన్ వసతి సముదాయంలోకి బుధవారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. మార్చి నెల వరకు ఈ భవనాన్ని మహిళా శ్రీవారి సేవకుల విడిదికి కేటాయిస్తూవచ్చారు. అదే నెలలో శ్రీవారి సేవకుల విడిది కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడంతో ఈ మూడో పీఏసీ సముదాయం ఖాళీ అయింది.


అందుబాటులోకి మరో  టీటీడీ వసతి సముదాయం

దీనిని ఇకమీదట సామాన్య భక్తుల బసకు ఉపయోగిం చాలని టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు తగిన మరమ్మతులు, ఆధునికీకరణ పనులు పూర్తిచేశారు. సోమవారం వసతి భవనం హాలులో రిసెప్షన్ డిప్యూటీ  ఈవో పార్వతి పూజలు నిర్వహించారు. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి సమస్యలను గుర్తించి పరిష్కరించాక, బుధవారం నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు కేటాయించాలని నిర్ణయించారు. రెండంతస్తుల ఈ భవనంలో పది హాళ్లు ఉండగా దాదాపు 2 వేల మందికి ఇక్కడ బస కల్పించవచ్చు.టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలకు మొత్తం రూ. 1.9 కోట్లు విరాళంగా అందింది. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి మే నెల కోటాలో లక్కీడిప్ ద్వారా కేటాయించేందుకు 350 ఆర్జిత టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. సేవ జరిగే ముందు రోజు విజయాబ్యాంకులో నమోదు చేసుకుని లాటరీ ద్వారా పొందవచ్చు.

No comments:

Post a Comment