రాజమండ్రి, మే 2, (way2newstv.in)
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా ఇసుక తవ్వకాలకు రకరకాల మార్గాలను అనే్వషించడం ప్రారంభించారు. అందులోనుంచి పుట్టుకొచ్చిందే ‘పట్టా భూముల్లో ఇసుక తొలగింపు’ వ్యవహారం. రాష్ట్ర విభజన, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక ప్రజాప్రతినిధికి సమీప బంధువు అని చెప్పుకునే ఒక వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో మొట్టమొదటిసారిగా ‘పట్టా భూముల్లో ఇసుక తొలగింపు’ను తెరపైకి తెచ్చాడు. గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు ‘కుడి ఎడమల దగా దగా’ అన్న చందంగా సాగుతున్నాయి. ఒకవైపు రైతుల పట్ట్భాముల్లో ఇసుక పేరుకుపోయిందని, వ్యవసాయానికి అనువుగా మార్చుకోవడానికి భూముల్లోని ఇసుక తొలగించుకుంటామంటూ అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం అదే భూములకు ఒక అనధికార ర్యాంపు ఏర్పాటుచేసి ఇసుక యథేచ్ఛగా యంత్రాలతో తవ్వి అమ్మేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భూములకు అనుమతులు తీసుకుని, ఈ అక్రమ వ్యవహారాలన్నిటికీ తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కేంద్రంగా ఉండటం గమనార్హం.నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలను నియంత్రించాలంటూ కొనే్నళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటివరకు ఉన్న ర్యాంపులన్నీ మూతపడ్డాయి.
ఇసుక తవ్వకాలకు కొత్త మార్గాలు
ఇవన్నీ జిల్లాల వారీగా వేలం, సీల్డు టెండరు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం అనుమతించిన ర్యాంపులు. ర్యాంపుల్లో పేరుకుపోయిన ఇసుకను కచ్చితమైన లెక్కలతో అంచనావేసి, ఎంతవరకు తవ్వడానికి అవకాశముందో గుర్తించి, ఆమేరకు తవ్వకానికి మాత్రమే అనుమతించాలని అప్పట్లోనే న్యాయస్థానం ఆదేశించింది. దీనితో లభ్యత తగ్గిపోవడంతో ఇసుక అనేది బంగారంగా మారిపోయింది. న్యాయస్థానం సూచనల మేరకు అధికారులు ఇసుక లభ్యతను, తవ్వవలసిన పరిమాణాలను అంచనావేసి, ర్యాంపులను ప్రతిపాదించేవారు. లభ్యత తగ్గిపోవడంతో ఇసుక బంగారంగా మారిపోయింది. నిర్మాణ రంగం ఊపందుకోవడంతో ఎంత ధర అయినా చెల్లించడానికి సీతానగరం మండలంలోని పలు గ్రామాలు గోదావరి తీరంలో ఉంటాయి. పలు గ్రామాల్లో వందలా ఎకరాల పట్ట్భాములు కోతకు గురై దశాబ్దాలుగా గోదావరిలో కలిసిపోయాయి. ఈ భూముల యజమానులకు భూమి పట్టాలుంటాయి, కానీ భూమి అంటే గోదావరే. అలాంటి పలువురు రైతుల పట్టాలోని విస్తీర్ణం ఆధారంగా సదరు వ్యక్తి అనధికారికంగా లీజుకు తీసుకున్నాడు. ఎకరానికి రూ.20 వేల నుండి రూ.30 వేలు లీజు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం తమ పట్టా భూముల్లో మేటలు వేసిన ఇసుకను తొలగించి, వ్యవసాయానికి అనువుగా మలచుకోవడానికి అనుమతించాలంటూ ఆ రైతుల పేరిట అభ్యర్థనలు సమర్పించేలాచేసి, ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో అనుమతి లభించేలాచేశాడు. ఇక ఈ అనుమతి ముసుగులో గోదావరిలోకి అనధికారికంగా రహదారి సైతం నిర్మించేసి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపేశారు. ఇలా వందల కోట్ల రూపాయలు ఆయన ఆర్జించాడనేది ప్రతీతి. తదనంతరం ఆయన ఈ వ్యవహారాలకు దూరం అయ్యారు.ఇది అత్యంత లాభసాటి వ్యవహారంగా మారడంతో పలువురు పలుకుబడి కలిగిన వారు సైతం ఇదే తరహాలో పట్ట్భాములో ఇసుక తొలగింపు ప్రారంభించారు. ఈ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనేవుంది. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో సీతానగరంలో ఆరు చోట్ల పట్టా భూములకు ఇసుక తవ్వుకునే అనుమతులు పొందారు. ఇదే మండలంలోని ములకల్లంకలో 11 చోట్ల పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఈ అనుమతులన్నీ రెవెన్యూ వైపు నుంచే ఇవ్వాల్సి వుంది.ఈ పట్టా భూముల్లో ఇసుక కూడా ప్రభుత్వ విధానం ప్రకారం పేరుకు ఉచితమే అయినప్పటికీ బాట చార్జీలు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, లోడింగ్ చార్జీల పేరుతో ర్యాంపు, కౌంటరు ఏర్పాటుచేసి, పెద్దఎత్తున వ్యాపారాన్ని సాగిస్తున్నారు.కాగా ఈ వ్యవహారానికి ఆద్యుడైన ప్రజాప్రతినిధి సమీప బంధువు మళ్లీ రంగంలోకి దిగాడు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వైపు ఇదే తరహాలో గోదావరిలో కలిసిపోయిన భూముల్లో ఇసుక తొలగింపు పేరిట అనుమతులు సంపాదించినట్టు సమాచారం. అయితే కొంత కాలంవరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి అనుమతులివ్వడానికి ససేమిరా అనడంతో సదరు వ్యక్తి వౌనంగా ఉండిపోయాడు. ఆయన బదిలీపై వెళ్లడంతో మళ్లీ యథావిథిగా అనుమతులు పొందినట్టు సమాచారం. అయితే ఆ భూములకు పశ్చిమ గోదావరి జిల్లావైపు ఇసుక బయటకు తీసుకువచ్చే మార్గం ఉండదు. దీనితో గతంలో తనకు పరిచయమున్న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోనే మళ్లీ దుకాణం తెరిచినట్టు విశ్వసనీయ సమాచారం. అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా భూములకు అయినా, ఇసుక తవ్వకాలు, విక్రయాలు మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తూ మళ్లీ రెండు చేతులా ఆర్జిస్తున్నట్టు సమాచారం.ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పెద్దలు ఇలా ఎవరినీ వదలకుండా వారిస్థాయిలో వారిని సంతృప్తిపరుస్తూ, వ్యవహారాన్ని సాఫీగా సాగించుకుంటున్నట్టు సమాచారం. రేయింబవళ్లు యంత్రాలతో సాగిస్తున్న ఇసుక తవ్వకాల కారణంగా నదీ గర్భానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. నిఘా విభాగం అధికారుల నిద్రలేస్తే ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు
No comments:
Post a Comment