Breaking News

03/05/2019

ఏపీలో క్రాస్ ఓటింగ్ టెన్షన్

నెల్లూరు, మే 3, (way2newstv.in)
ఏపీలో ఈ సారి చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా చాలా స్వల్పంగా జరిగింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పోటీ చేసినప్పుడు చాలా నియోజకవర్గాల్లో భ‌యంక‌ర‌మైన క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఓట‌రు ఎంపీకి ఓ పార్టీకి, ఎమ్మెల్యేకి మ‌రో పార్టీకి ఓట్లు వేశారు. ఈ క్రాస్ ఓటింగ్ ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో, ఒక్కో సామాజిక‌వ‌ర్గంలో ఒక్కోలా జ‌రిగింది. దీంతో ఆ ఎన్నిక‌ల్లో చాలా మంది అభ్య‌ర్థుల త‌ల‌రాతలు మారిపోయాయి. ముక్కోణ‌పు పోటీలో ఓట్ల చీలిక‌, క్రాస్ ఓటింగ్‌తో చాలా మంది మ‌హామ‌హులు సైతం ఓడిపోయారు. ఎన్నికల్లో జనసేన పోటీతో పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మళ్లీ క్రాస్ ఓటింగ్ తప్పలేదు. ఈ ఎన్నిక‌ల్లో సైతం క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ అధికార టీడీపీ వైపే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ముఖ్యంగా నాలుగు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంతో ఆ నాలుగు సీట్ల‌లో టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. అయితే గ‌తంలో కంటే భిన్నంగా ఈ సారి ఈ నాలుగు సీట్ల‌లో ఒక చోట టీడీపీ ఓటు బ్యాంకు జ‌న‌సేన అభ్య‌ర్థికి క్రాస్ అవ్వ‌గా మిగిలిన మూడు చోట్ల మాత్రం వైసీపీ వేసిన బీసీ ఎత్తుగ‌డ దెబ్బ‌తో బీసీ సామాజిక‌వ‌ర్గం ఓట్లు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థుల‌కు బ‌దిలీ అయ్యి అక్క‌డ ఆ ముగ్గురు ఎంపీ అభ్య‌ర్థులు గెలిచే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 


 ఏపీలో క్రాస్ ఓటింగ్ టెన్షన్

ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ లోక్‌సభ సీటు నుంచి జనసేన అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీలో ఉండడంతో అసెంబ్లీకి టిడిపికి ఓట్లు వేసిన వారంతా లోక్‌స‌భకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు కాకుండా మిగిలిన సామాజికవర్గాల్లో మెజారిటీ ఓటర్లు సైతం ఇలాగే ఓటు చేశారు. ఇక అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు సైతం ఎంపీకి జేడీకి ఓటు వేయడం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత.ఇక ఇప్పటి వరకు రాయలసీమలో క్రాస్ ఓటింగ్ అనే పదానికి పెద్దగా చోటు ఉండేది కాదు. సీమ ఓట‌రు రెండు ఓట్లు ఒకే పార్టీకి వేసి తీర్పు ఇవ్వ‌డం అక్క‌డ ప్ర‌త్యేక‌త‌. తాజా ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లోనూ మూడు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ బీసీలు ఎక్కువ‌గా ఉండే అనంత‌పురం జిల్లాలో అనంత‌పురం, హిందూపురం ఎంపీ సీట్ల‌తో పాటు క‌ర్నూలు ఎంపీ సీటును సైతం బీసీల‌కే ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీమ‌లో ఉన్న బీసీల‌ను తెలుగుదేశం పార్టీ కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంతే త‌ప్పా… బీసీల‌కు సీట్లు ఇవ్వ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ సారి బీసీల్లో బ‌ల‌మైన మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వైసీపీ హిందూపురం ఎంపీ సీటును కురుబ‌ సామాజిక‌వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్‌కు, అనంత‌పురం ఎంపీ సీటును బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన త‌లారి రంగ‌య్య‌కు ఇచ్చింది. క‌ర్నూలు సీటును చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ సంజీవ్ కుమార్‌కు కేటాయించింది. సీమ‌లో ఈ మూడు ఎంపీ సీట్లు బీసీల్లో బ‌ల‌మైన మూడు సామాజిక‌వ‌ర్గాలకు చెందిన వ్య‌క్తుల‌కు ఇవ్వ‌డంతో ఆ సామాజిక‌వ‌ర్గాల ఓట్ల‌న్ని ఈ సారి గంప‌గుత్త‌గా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థుల‌కి ప‌డ్డాయి.జ‌గ‌న్ హిందూపురం ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ పోలీస్ అధికారి అయిన కురుబ సామాజిక‌వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్‌ను ఎంపిక చేసి చాలా డేర్ చేశార‌నే చెప్పాలి. పోలీస్ శాఖ‌లో డైన‌మిక్ అండ్ డేరింగ్ ఆఫీస‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న గోరంట్ల మాధ‌వ్ అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ. దివాక‌ర్ రెడ్డికే నాలుక కోస్తాన‌ని వార్నింగ్ ఇచ్చి పెద్ద సంచ‌ల‌నం రేపారు. హిందూపురం లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీసీల్లో బ‌లంగా ఉన్న కురుబ‌, బోయ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సారి వీరంతా ఎంపీకి మాత్రం త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని గెలిపించుకోవాల‌న్న ల‌క్ష్యంతో మాధ‌వ్‌కే ఓటు వేసిన‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి జ‌న‌సేన‌, టీడీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఎంపీకి మాత్రం గోరంట్ల‌కే వేశారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప వ‌ర‌స‌గా రెండు సార్లు గెలుస్తు వ‌స్తుండ‌డంతో పాటు ఈ సారి వ్య‌తిరేక‌త‌ను మూట క‌ట్టుకోవ‌డం, వైసీపీ వేవ్ మాధ‌వ్‌కు ప్ల‌స్ కానున్నాయి. టీడీపీ కంచుకోట అయిన హిందూపురం ఈ సారి కూలిపోయే దిశ‌గా ఫ‌లితం రానుంది.ఇక అనంత‌పురం ఎంపీ సీటును కూడా మ‌రో బీసీ సామాజిక‌వ‌ర్గ‌మైన బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన త‌లారి రంగ‌య్య‌కు ఇచ్చారు. అనంత‌పురం లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క‌ళ్యాణ దుర్గం, రాయ‌దుర్గంతో పాటు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బోయ సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. రంగ‌య్య‌కు సీటు ఇవ్వ‌డంతో బోయ‌ల‌తో పాటు మిగిలిన సామాజిక‌వ‌ర్గాలు, హిందూపురం ఎంపీ సీటు ప‌రిధిలో ఉన్న బోయ‌లంతా కూడా వైసీపీకే ఓట్లు వెయ్య‌డంతో జ‌గ‌న్ ఈక్వేష‌న్ ఇక్క‌డ బాగా సెట్ అయ్యింది. క‌ర్నూలు నుంచి జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన బుట్టా రేణుక‌ను రంగంలోకి దింప‌గా ఆమె వైసీపీ ఎంపీగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె టీడీపీలోకి జంప్ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి వైసీపీ గూటికి రివ‌ర్స్ జంప్ చేశారు.మ‌రో సారి జ‌గ‌న్ క‌ర్నూలులో గ‌త ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్ పాటిస్తూ చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ సంజీవ్ కుమార్‌కు సీటు ఇచ్చారు. టీడీపీ నుంచి సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఈ సారి గ‌తానికి భిన్నంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉన్న చేనేత వ‌ర్గంతో పాటు బీసీలంద‌రూ క‌లిసిక‌ట్టుగా వైసీపీ అభ్య‌ర్థికి ఓట్లు వేసిన‌ట్టు తెలిసింది. ప‌త్తికొండ‌, డోన్ లాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను బీసీ ఓట‌ర్లు ఎక్కువ‌గా వైసీపీ అభ్య‌ర్థి వైపు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కూడా భారీ ఎత్తున వైసీపీ ఎంపీ అభ్య‌ర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఏదేమైన టీడీపీ క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్‌తో నాలుగు సీట్ల వ‌ర‌కు లాస్ అయ్యే ఛాన్సులే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

No comments:

Post a Comment