Breaking News

01/05/2019

మంత్రాలయం లో ఘనంగా మేడే వేడుకలు

మంత్రాలయం మే 01 (way2newstv.in)  
మంత్రాలయం లో మేడే వేడుకలు ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు జండా ఆవిష్కరణ 133 వ.మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మంత్రాలయంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం సర్కిల్లో సిఐటియు ఎఐటియుసి జండా ఆవిష్కరణ గావించారు. 


మంత్రాలయం లో ఘనంగా మేడే వేడుకలు

అనంతరం నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతన చట్టం పనికి తగ్గ వేతనం కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నామని అయితే ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కార్మికులను వెట్టిచాకిరి చేస్తున్నారని విమర్శించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిన వెంటనే తొలగించాలని కార్మికులకు కనీస వేతన చట్టం ఎనిమిది గంటల పని దినాలు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిధిలోని వగరూరు గ్రామంలో కూడా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జండా ఆవిష్కరణ గావించి నాయకుల త్యాగాలను స్మరించుకున్నారు

No comments:

Post a Comment