Breaking News

03/05/2019

పకడ్బందీగా రీపోలింగ్

అమరావతి మే 3 (way2newstv.in)
రాష్ట్రంలో మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ ప్రక్రియను అత్యంత పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో మే, 6న నిర్వహించనున్న రీ-పోలింగ్ ప్రక్రియపై ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో     97-నరసరావుపేట అసెంబ్లీ, 14-నరసరావుపేట పార్లమెంటుకు చెందిన 94వ పోలింగ్ స్టేషన్ లో అసెంబ్లీ మరియు పార్లమెంటుకు, 94-గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, 13-గుంటూరు పార్లమెంటు పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ పరిధిలోను అసెంబ్లీ మరియు పార్లమెంటుకు, అదే విధంగా ప్రకాశం జిల్లా పరిధిలోని    102-ఎర్రగొండపాలెం అసెంబ్లీ, 16-ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 247 పోలింగ్ స్టేషను పరిధిలోను అసెంబ్లీ మరియు పార్లమెంటుకు రీ-పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 


పకడ్బందీగా రీపోలింగ్

నెల్లూరు జిల్లాలోని 116-కోవూరు అసెంబ్లీ సెగ్మెంటుకు చెందిన 22-నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 41 పోలింగ్ స్టేషన్ పరిధిలో పార్లమెంటు సంబంధించిన రీ-పోలింగ్, 121-సూళ్ళూరు పేట అసెంబ్లీ సెగ్మెంటుకు చెందిన 23-తిరుపతి (ఎస్.సి) పార్లమెంటుకు చెందిన 197 పోలింగ్ స్టేషన్ పరిధిలో పార్లమెంటు సంబంధించిన రీ-పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సిబ్బంది శుక్రవారం సాయంత్రమే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా ఎన్నికల అధికారులు అన్ని చర్యలను తీసుకోవాలన్నారు.  మే, 6న నిర్వహిస్తున్న ఈ రీ-పోలింగ్ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాలని మాక్ పోలింగ్, ఇతర పోలింగ్ ప్రక్రియను ఎటువంటి సంఘటనలు ఉత్పన్నమవ్వకుండా పకడ్భందీగా నిర్వహించాలని ద్వివేది తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో టెంట్లు, ఇతర మౌలిక వసతులైన త్రాగునీరు తదితర ఏర్పాట్లను పూర్తి చేశామని, బందోబస్తుకు సంబంధించిన అన్ని చర్యలను పూర్తి చేయడం జరిగిందని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జిల్లా ఎన్నికల అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలిసులు సిఈఓకు వివరించారు. రీ-పోలింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల పరిధిలో వెబ్-కాస్టింగ్¬తో పాటు మాన్యువల్ వీడియో గ్రాఫింగ్ కూడా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.రీ-పోలింగ్ జరిగే ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించడం జరిగిందని రీ-పోలింగ్ జరిగే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని ద్వివేది తెలియజేశారు. ఈ వీడియో కాన్పరెన్సులో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి అదనపు ఎన్నికల అధికారులు సుజాత శర్మ, వివేక్ యాదవ్¬లతో పాటు ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు.

No comments:

Post a Comment