Breaking News

14/05/2019

జగన్ గెలిస్తే... మళ్లీ ఉప ఎన్నికలు

హైద్రాబాద్, మే 14, (way2newstv.in)
ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఫిరాయింపులు... ఆపరేషన్ ఆకర్ష్ తప్పనిసరై పోయింది. అధికారం కోసం కొందరు, పదవుల కోసం ఇంకొందరు... ప్రభుత్వ ఏర్పాటు చేసిన పార్టీల్లోకి చేరిపోవడం ఈ మధ్య రాజకీయాల్లో సర్వ సాధారణమైపోయింది. ఒకవేళ ఏపీలో వైసీపీ గెలిచాక.. పార్టీ ఫిరాయింపులు జరిగితే ఉప్ప ఎన్నికలు తప్పవా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏ పార్టీ ప్రజా ప్రతినిధి తన పార్టీలోకి రావాలనుకున్నా ... పార్టీతోపాటు.. పదవులకు కూడా రాజీనామా చేసి రావాలని జగన్ కఠిన నిబంధనలు పెట్టినట్లు సమాచారం. గత ఉప ఎన్నికల సందర్భంలో జగన్ ఇదే రూల్‌ని ఫాలో అయ్యారు. తన పార్టీ గుర్తుపై గెలిపించుకొని నైతికత చాటుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా టీడీపీని కూడా ఇరకాటంలో పెట్టొచ్చని యువనేత భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ ఆలోచనలో మార్పు ఉండదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మే 23న ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. 


జగన్ గెలిస్తే... మళ్లీ ఉప ఎన్నికలు

ఈ ఫలితాల్లో దేశానికి ప్రధాని ఎవరు అవుతారోనన్న సస్పెన్స్‌తో పాటు... ఏపీలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఏపీలో ఏ పార్టీకి వన్ సైడ్ మెజార్టీ వచ్చినా... ఒకవేళ స్పష్టమైన మెజార్టీ రాకపోయిన ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. వైసీపీ నుంచి 20కు పైగా ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పేసుకున్నారు. అయితే తాజాగా ఎన్నికలు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే సీన్ ఎక్కడ తన విషయంలో రిపీట్ అవుతాదామోనన్న భయంతో ఉన్నారు చంద్రబాబు. అయితే జగన్ మాత్రం పార్టీ ఫిరాయింపులపై మొదట నుంచి చెబుతున్న మాట మీద నిలబడినట్లు సమాచారం. ఒకవేళ అన్ని అనుకూలించి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే.. పార్టీ ఫిరాయింపు నేతలపై ఆయన కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.జగన్ గతంలో కూడా తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్నపుడు వారిని పదవులకు రాజీనామా చేయామని డిమాండ్ చేశారు. ఇపుడు కూడా వైసీపీలో చేరడానికి అనేకమంది టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే జగన్ మాత్రం వారికి కండిషన్లు పెడుతున్నారు. ఎవరైనా తమ పార్టీలోకి చేరాలంటే మాత్రం వారు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రావాలని చెబుతున్నారు. దీంతో పాటు పదవులను కూడా వదులుకోవాలంటున్నారు. అయితే అదే సమయంలో పార్టీలో చేరేవారికి భవిష్యత్తు భరోసా కూడా కల్పిస్తున్నారు వైసీపీ అధినేత. గెలిస్తే మంత్రిపదవులతో పాటు.. ఓడిన అభ్యర్థికి భవిష్యత్తు భరోసా ఇస్తున్నారు జగన్. మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతవరకు  అమలవుతాయో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment