Breaking News

25/05/2019

అనామకుల చేతిలో ఓడిపోయిన పాపులర్ లీడర్స్


నెల్లూరు, మే 25, (way2newstv.in)
వేవ్ వచ్చినపుడు వేవ్ ఉన్న ఉన్న పార్టీ టిక్కెట్ దక్కిన వాళ్లు అదృష్టవంతులు. చరిత్ర మొత్తం చెప్పేది ఇదే. ఒకరిని ఓడించాలని జనం ఫిక్సయ్యారంటే... ఇటువైపు ఉన్నది ఎవరో కూడా చూడకుండా గుద్దేస్తారు. ఆ క్రమంలో ఎవరికీ తెలియని అనామకులు గెలిచేస్తారు. ఇలాంటి సంఘటనలు 2019 ఏపీ ఎన్నికల్లో చాలా జరిగాయి. 
ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలలో పాపులర్ టీడీపీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు మట్టి కరిపించారు. అలాంటి ప‌రిస్థితి ఒక‌టి రెండుచోట్ల కాదు.. చాలా చోట్ల ఉండ‌టం విశేషం.
* అనంతపురం ఎంపీ- తలారి రంగయ్య
ఈయన ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్‌డీఏలో పీడీగా పనిచేశారు. బీసీ కోటాలో జగన్ ఈయనకు సీటిచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్‌పై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.
* గుంటూరు ఎంపీ - నందిగం సురేష్
బాపట్ల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్‌ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ మాల్యాద్రిని ఓడించారు.



అనామకుల చేతిలో ఓడిపోయిన పాపులర్  లీడర్స్
* అరకు ఎంపీ - గొడ్డేటి మాధవి 
మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రముఖ రాజవంశీకుడు అయిన ప్రత్యర్థి టీడీపీ అభ్య‌ర్థి కిశోర్‌ చంద్రదేవ్‌ ను ఓడించారు. ఈయన మాజీ కేంద్ర‌మంత్రి. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన 
వ్యక్తి. అయినా వైసీపీ వేవ్ లో ఆయ‌న ఓట‌మిపాలు కాక త‌ప్ప‌లేదు.
‘ హిందూపురం ఎంపీ - గోరంట్ల మాధవ్
వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్‌ సాధారణ పోలీసు ఉద్యోగి. అయితే... ఫ్యాక్షన్‌, రౌడీయిజాలపై గట్టిగా కృషిచేశారు. దీంతో అతనికి విజయం దక్కింది. ఇతను ఓడించింది సాధారణ వ్యక్తిని 
కాదు, హిందూపురంలో పలుమార్లు గెలిచిన సీనియర్ లీడర్ నిమ్మల కిష్టప్పను.
* చిత్తూరు ఎంపీ - రెడ్డప్ప 
రెడ్డప్ప పేరు కూడా చాలామందికి తెలియదు. అతను ఓ సాధారణ స్థాయి నేత. ఆయన సీనియర్ ఎంపీ ఎన్‌ శివప్రసాద్‌పై గెలిచారు.
వీరితో పాటు ఇంకొన్ని ఘటనలు ఇవి
1. ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్‌ మంత్రి కళా వెంకట్రావును ఓడించారు. 
2. విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో టీడీపీ కంచుకోట. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కలిదిండి శ్రీనివాస్‌ ఏడుసార్లు గెలిచిన టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడును మట్టికరిపించారు.
3. కర్నూల్‌ జిల్లా నందికొట్కూర్‌లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్‌ అధికార పార్టీ అభ్య‌ర్థిని మట్టి కరిపించారు.
4. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి, లండన్ అబ్బాయి దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై గెలుపొంది సంచ‌ల‌నం సృష్టించారు. 

No comments:

Post a Comment