Breaking News

13/05/2019

మంద కృష్ణ అందోళన

గద్వాల్ మే 13 (way2newstv.in)
గత శనివారం గద్వాల్ జిల్లా లో బస్సు, క్రూయిజర్  ప్రమాదం లో మరణించిన 16 మంది మృతుల కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు మండుటెండలో నిరసనకు దిగారు. ప్రమాదంలో చనిపోయింది దళితులు. రెండు రాష్ట్రాల  ప్రభుత్వాల తరపున ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదని వారన్నారు. బాధితకుటుంబాలకు  న్యాయం జరిగేలా చూడటం లో వివక్ష  ప్రదర్శించడం జరిగిందని ఆరోపించారు. 


మంద కృష్ణ అందోళన

మృతుల కుటుంబాలకు ఆర్థిక పరమైన న్యాయం చేయడానికి ఎన్నికల ప్రకటన అడ్డుగా ఉందనే సాకుతో దళితులు అయినదునే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారుసమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్,  పోలీస్ ఎస్పీ కృష్ణ మాదిగతో  చర్చలు జరిపారు.  నారాయణ పేట లో 100 రోజుల పనికి వెళ్లి మృతి చెందిన భాదితులకు  చెల్లించిన విదంగానే నష్ట పరిహారం చెల్లిస్తామని హామినిచ్చారు.  వీలయిన వారికి రైతు బంధు వర్తింప చేస్తామనిఅన్నారు. మృతులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పిల్లల చదువులు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించాలి.  హైవే మీద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని మంద కృష్ణ డిమాండ్ చేసారు. 

No comments:

Post a Comment