Breaking News

01/05/2019

కాలువల శుద్ధికి కార్యక్రమం

విజయవాడ, మే 1,  (way2newstv.in
ఏలూరు కెనాల్, బందరు కెనాల్, రైవస్ కెనాల్ లో వ్యర్దాలు ఎక్కువగా ఉండటం వలన నీరు కలుషితమవుతుంది. తడి చెత్త ,పొడి చెత్త వేరు వేరుగా వేయటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నా నగరవాసులు వాటిని వాడుకోవడం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో అనే కార్యక్రమం ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కెనాల్స్ ని శుభ్రపరచాలని నిర్ణయం తీసుకున్నామని అయన వెల్లడించారు. 


కాలువల శుద్ధికి కార్యక్రమం

కాలువలు, కెనాల్స్ నీటుగా ఉంటే అందులోకి వచ్చే నీరు శుభ్రంగా ఉంటుంది. కెనాల్స్ పక్కన నివసించే వారు దయచేసి వ్యర్థాలని కాలువల్లో వెయ్యొద్దని అయన సూచించారు. ఈ కెనాల్స్ ని శుభ్రపరచే కార్యక్రమం లో నగరవాసులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అయన పిలుపునిచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతి నెలా రెండు రోజులు ఈ క్లీనింగ్ ప్రక్రియ ఉంటుంది. 102 స్వచ్చంధ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గోంటున్నాయని కలెక్టర్ తెలిపారు. 

No comments:

Post a Comment