Breaking News

03/05/2019

యాసంగిలో దండిగా వస్తున్న ధాన్యం

మెదక్, మే 3, (way2newstv.in)
యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో  ధాన్యం దండిగా వచ్చి చేరుతున్నది. దీంతో కేంద్రాలన్ని ధాన్యం రాశులతో నిండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 159 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సీజన్‌లో జిల్లాలో లక్షా10 వేల ఎకరాల్లో వరి సాగైంది. 


యాసంగిలో దండిగా వస్తున్న ధాన్యం

దీంతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకొని అందుకు తగ్గట్లు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసింది. గజ్వేల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించగా, మిగితా చోట్ల స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వరిధాన్యం గ్రేడ్ (ఏ) రకం క్వింటాల్‌కు రూ.1,590, సాధారణ రకానికి రూ.1,550 మద్దతు ధరను ప్రభు త్వం నిర్ణయించింది.

No comments:

Post a Comment