Breaking News

28/05/2019

ఇంటర్ ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకునే ఇలా


2262 మంది విద్యార్థులకు అవకాశం
జూన్ 9వ వరకు ఈపాస్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
జగిత్యాల మే 28 (way2newstv.in):
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎస్సి, ఎస్టీ బిసి ఈబిసి, మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మిడియెట్ లో ఉచిత కార్పొరేట్ విద్యను అదించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు ఎవరు ఆర్హులు దరఖాస్తుల సమర్పణ విధానంపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఇలా వివరించారు .
ఎవరు ఆర్హులు :
పదో తరగతిలొ ఉత్తమ మార్కులను సాధించిన పేద ఎస్సి, ఎస్టీ ,బిసి, ఈబిసి మైనార్టీ విద్యార్థులకు ఈపథకం ద్వారా ఇంటర్ లొ కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా పొందుటకు ఆర్హులు 2018-2019 విద్య సంవత్సరంలొ పదవ తరగతిలొ 7జిపిఏ పైబడి స్కోర్ సాధించిన స్థానిక విద్యార్థులై ఉండాలి విద్యార్టీ కుటుంబం వార్షిక ఆదాయం 1.50 లక్ష  మించరాదు


ఇంటర్ ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకునే ఇలా

దరఖాస్తు సమర్పణ విధానం ఇలా 
జూన్ 9వ తేది లొపు ఈపాస్ వెబ్ సైట్ లొ ఆన్ లైన్ పద్దతిలో దరఖాస్తులు సమర్పించాలి 
దరఖాస్తు సమయంలోనె విద్యార్థి కుల, అనాయ స్థానికత ,ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి .రేషన్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డు తప్పనిసరి దివ్యాంగులైతే అందుకు 
సంబంధించిన ధ్రువపత్రం సమర్పించాలి.
 ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 13న  ప్రకటిస్తారు .జూన్ 14వ తేది నుంచి విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి 17 వ తేది లోగా తుది జాబితాను ప్రకటిస్తారు .షెడ్యూల్ కులాల ,బిసి ,మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 2262 మందిని ఉచిత కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యకు ఎంపిక చేయుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .ఇందులో ఎస్సిలు 845 మంది, ఎస్టీలు 551 మంది బిసిలు 483 మంది బిసిసిలు 143 మంది ఈబీసీలు 136 మంది మైనార్టీలు 104 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు .ఉచిత ఇంటర్ కార్పొరేట్ విద్యాపథకం కింద ఎంపికైన విద్యార్థిపై ప్రతి సంవత్సరం 39 వేలు  ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఎంపికైన విద్యార్థికి ఉచిత వసతి భోజన సదుపాయాలను సైతం కల్పిస్తారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నందున కార్పొరేట్ కళాశాల ఎంపికను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడుతోంది ,కళాశాలలను అన్ని రకాల మౌలికవసతులతొ పాటు కళాశాల రికార్డు ఫలితాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది .మరిన్ని వివరాలకు సందేహాలకు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారిని నేరుగా సంప్రదించాలని ఎస్సి అభివృద్ధి శాఖ డైరెక్టర్ పి కరుణాకర్ రెడ్డి ప్రకటించినట్లు హరి అశోక్ కుమార్ విద్యార్థుల సమాచారార్థం వివరించారు.

No comments:

Post a Comment