Breaking News

08/05/2019

వైసీపీకి ఆ ఐదు సీట్లే నటా...

విశాఖపట్టణం, మే 8, (way2newstv.in)
ఉత్తరాంధ్రలో బాగా పుంజుకున్నాం, ఈసారి మెజారిటీ సీట్లు సాధిస్తామని ఓ వైపు వైసీపీ నేతలు గట్టిగా చెప్పుకుంటున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న పదిహేను అసెంబ్లీ సీట్లకు గాను పదికి తక్కువ లేకుండా గెలుస్తామని కూడా పోలింగ్ అనంతరం వైసీపీ నేతలు ప్రకటించారు. మరి వారి అంచనాలు ఎలా ఉన్నా ప్రత్యర్ధి టీడీపీ మాత్రం తాను చేయించుకున్న సర్వేలో వైసెపీకి అయిదు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చేసింది. ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా ఉంది. వైసీపీ వల్ల డ్యామేజ్ పెద్దగా ఉండదని, మెజారిటీ సీట్లు మళ్ళీ టీడీపీకేనని సైకిల్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.విశాఖ అర్బన్ జిల్లాలోని భీమునిపట్నం, రూరల్ జిల్లాలోని మాడుగుల, చోడవరం , పాడేరు. అరకు సీట్లు వైసీపీ ఖాతాలో టీడీపీ నేతలు వేశారు. మిగిలిన పదిలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి గెలిస్తే తొమ్మిది సీట్లలో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. 


వైసీపీకి ఆ ఐదు సీట్లే నటా....

ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, పెందుర్తి, విశాఖ సౌత్, నార్త్ సీట్లు, నర్శీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి టీడీపీకే వస్తాయని కూడా అంచనాలు వేసుకున్నారని సమాచారం. అదే విధంగా విశాఖ, అనకాపల్లి ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయని, అరకు ఎంపీ సీట్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారుట. ఇదిలా ఉండగా టీడీపీ చేసిన సర్వేను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే సాధించిన తమ పార్టీకి టీడీపీ నేతలే అయిదు సీట్లు ఇస్తే జనం రెట్టింపు సీట్లు ఇస్తారని వారు కచ్చితంగా చెబుతున్నారు. టీడీపీ చెబుతున్నట్లుగా ఆ పార్టీ గెలుపు అంత సులువు కాదని అన్ని చోట్లా హోరా హోరీ జరిగిందని, పదికి తగ్గకుండా వైసీపీ ఖాతాలో అసెంబ్లీ సీట్లు, కనీసంగా రెండు పార్లమెంట్ సీట్లు విశాఖ జిల్లాలో పడతాయని కూడా వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఇక టీడీపీ ధీమాకు మహిళల పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రావడం కారణమైతే, వైసీపీ ధీమాకు ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల పూర్తిగా జనంలో వ్యతిరేకత ఉందని, వారిని జనం తిరిగి గెలిపించరని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక పోలింగ్ సరళి కూడా తమకే అనుకూలమని చెబుతున్నారు. మ‌రి టీడీపీ అంచనాలు కరెక్ట్ అవుతాయా, వైసీపీ వేసిన లెక్కలు నిజమవుతాయా అన్నది ఎన్నికల ఫలితాలే చెప్పాలి.

No comments:

Post a Comment