Breaking News

02/05/2019

‘అన్న ఔషధి’కి మంగళం

ఏలూరు, మే 2 (way2newstv.in): 
ఖరీదైన మందులను జనరిక్‌ పేరుతో అతి తక్కువ ధరకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం 2014లో అన్న సంజీవని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుకాణాలు ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల వెలుగు సిబ్బంది ఆ దుకాణాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత దుకాణాల నిర్వహణ తీరుపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో లోపభూయిష్టంగా మారాయి. చాలా చోట్ల కేవలం కొద్దిపాటి మందులతో కాలక్షేపం చేస్తున్నారు. చివరకు గర్భిణులు, బీపీ, షుగరు వ్యాధి గ్రస్థులకు సైతం దుకాణాల్లో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా సమాఖ్య సహకారంతో జిల్లాలో 82 అన్న సంజీవని దుకాణాలను ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణాల్లోని ఇతర కూడళ్లలో ఏర్పాటు చేశారు. తొలి సంవత్సరం బాగానే లాభాల్లో నడిచిన జనరిక్‌ దుకాణాలు అధికారుల అలసత్యంతో ప్రస్తుతం మూత దిశగా నడుస్తున్నాయి. 


‘అన్న ఔషధి’కి మంగళం

2010లో జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం ఆసుపత్రిలో జీవన్‌ ధార పార్మసీల పేరుతో దుకాణాలు తెరిచారు. 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ జనరిక్‌ మందులు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో 82 దుకాణాలను తెరిచారు. అయితే చాలా దుకాణాల్లో అనుకున్న స్థాయిలో మందులు లేకపోవడంతో ప్రభుత్వ ఆశయం ప్రస్తుతం నీరుగారుతుంది. డీఆర్డీఏ అధికారులు పట్టించుకోకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగానే చెప్పవచ్ఛు.స్వయం సహాయక సంఘాలకు మందుల విక్రయాలు అప్పగించారు. అయితే వారికి మందుల వినియోగం ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. అనుభవం ఉన్న ఫార్మాసిస్టులను విక్రయాలకు నియమిస్తే కాస్తయినా అవగాహనతో ప్రచారం చేస్తారు. కేవలం మందుల అట్టలపై ఉండే రంగులను పోల్చుకుని మహిళలు విక్రయాలు చేసేవారు. దీంతో చాలా చోట్ల మందులు తారుమారు అయ్యేవి. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్న సంజీవని దుకాణాల్లో 15 రోజులకు ఒకసారి స్టాకుకు ఇండెంట్‌ పెడతారు. అలా పెట్టిన 15 రోజులకు ఏలూరు సెంట్రల్‌ డ్రగ్‌ యూనిట్‌ నుంచి మందులు సరఫరా చేస్తారు. ఆయా ఆసుపత్రిల్లో రోగుల సంఖ్యను బట్టి 10 బాక్సులు అవసరమని పెడితే మూడు లేక నాలుగు బాక్సులు మాత్రమే పంపుతున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని విభాగాలు ఉన్నాయి. అటువంటప్పుడు వారికి కావాల్సిన మందులు కూడా ఉండాలి. అయితే కొన్ని మందులతోనే సరిపుచ్చుకుంటున్నారు.

No comments:

Post a Comment