Breaking News

08/04/2019

వెంకటగిరి రాజుల ఎఫెక్ట్ తో నెల్లూరు రాజకీయాలు

నెల్లూరు, ఏప్రిల్ 8(way2newstv.in)
నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున వెంకటగిరి నుంచి పోటీకి దిగినప్పుడే ఆయన గెలుస్తారని క్యాడర్ లో బలమైన నమ్మకం వచ్చేసింది. వెంకటగిరిలో మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వెంకటగిరి రాజా కుటుంబీకులు తెలుగుదేశాన్ని వీడి జగన్ పార్టీలో చేరడంతో వేలాదిగా ఉన్న వారి వర్గీయులంతా ఆనం వైపు టర్న్ తీసుకున్నారు. దీంతో ఆనం గెలుపు దాదాపుగా ఖాయమైపోయిందని చెబుతున్నారు.మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద కూడా ఇటీవల వైఎస్సార్సీపీలోకి వచ్చారు. దీంతో వెంకటగిరిపై టీడీపీ ఇప్పటికే ఆశలు వదిలేసుకుంది.అందుకే ఇప్పుడు ఆనంకు వచ్చే మెజారిటీ ఎంత అనేది ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది. పులివెందుల తర్వాత అంత మెజారిటీ సాధించి జగన్ కు బహుమతిగా ఇవ్వాలని ఆనం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. 


వెంకటగిరి రాజుల ఎఫెక్ట్ తో నెల్లూరు రాజకీయాలు

కృష్ణపట్నం–ఓబులవారిపల్లి రైల్వే పనులు చేసిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.కోట్లు డిమాండ్‌ చేయడం, వారు నిరాకరించడంతో తన అనుచరులతో పనులు అడ్డగించడం, కాంట్రాక్టర్లను కమీషన్ల డిమాండ్‌కు సంబంధించి ఆడియో టేపులు లీకై రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది.అయినా వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశంలో కనీస గౌరవం దక్కక వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్‌ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం. ఇప్పుడు రాజాల కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న ఫ్యానుగాలి.. ఆనం రాంనారాయణరెడ్డికి ఉన్న గుర్తింపు వెంకటగిరిలో ఆనం అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment