Breaking News

08/04/2019

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కందుల కొనుగోళ్లు

ఒంగోలు, ఏప్రిల్ 8, (way2newstv.in)
కందుల కొనుగోళ్లలో అక్రమాలు ఆగడం లేదు.  ప్రకాశం జిల్లాలో కంది కొనుగోలులో అవినీతి తారాస్థాయికి చేరింది. అధికారులు, దళారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నకిలీ రైతుల పేరుతో దళారులు కందుల విక్రయానికి పాల్పడుతున్నారు. తాజాగా కొనుగోలు చేసిన కందులలో భారీగా ఇసుక నింపి గోడౌన్లకు తరలిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు.  ప్రకాశం జిల్లాలో మార్కెటింగ్ శాఖలో అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, నగదు చెల్లింపుల విషయంలో ప్రతిసారి విమర్శలు సర్వసాధారణంగా మారిపోయాయి.దర్శిలో కందుల పంట ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ ఎక్కువ కేంద్రాలు’ అంటూ అధికారులు తరచూ చెబుతున్నారు. అవును దర్శి నియోజకవర్గంలో 14 వేల టన్నుల పండింది. అక్కడ 15 కేంద్రాలు కేటాయించారు. ఇదేక్రమంలో కనిగిరిలో 8 వేల టన్నులు పండితే, 3 కేంద్రాలు ఇచ్చారు. అద్దంకిలో 5500 టన్నులు పండితే మూడు కేంద్రాలు ఇచ్చారు. కొండపిలో 6 వేల టన్నులకు రెండు కేంద్రాలు ఇచ్చారు. జిల్లామొత్తం మీద 35 కొనుగోలు కేంద్రాలు ఉంటే దర్శికే 15 కేంద్రాలు ఇచ్చారు. 


అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కందుల కొనుగోళ్లు

కేటాయింపులోనే అసలు తంతు నడిచింది ఈ ఏడాది కందుల విక్రయాలలో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల దగ్గరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. మద్దతు ధరకు మార్కెట్ లో దళారులు అమ్ముకుంటున్నారు. ఇందులో దళారులతో పాటు మార్కెట్ అధికారులకు భాగం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు అధికారులు కూడా ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే కేంద్రాల కేటాయింపు దశలోనే జరగాల్సిన అక్రమాలన్నీ జరిగాయి. ఇక కొనుగోళ్లలో వీటిని నియంత్రించడం అధికారులకు తలకు మించిన భారమే. ఉత్పత్తిని అనుసరించి కేంద్రాలను కేటాయించాల్సిన దశలో నాయకుల సిఫార్సులకు తలొగ్గి, అనవరమైన చోట కేంద్రాలు కేటాయించారు. తొలిదశలోనే అక్కడ పాతవి, దళారులు తెచ్చినవి, శీతల గిడ్డంగుల నుంచి వచ్చిన వాటిని కొనుగోలు చేశారు. తాజాగా మళ్లీ ప్రయత్నాలు మొదలు  పెడుతున్నారు. వీటిపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా కేటాయింపుల్లోనే సిఫార్సులకు తలొగ్గిన అధికారులకు, ఫిర్యాదులు తలకెక్కడం లేదు.దర్శి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాల కేటాయింపులో సిఫార్సులే పనిచేశాయి. వినుకొండ, పొదిలి, మార్కాపురం ప్రాంతాల్లోని దళారుల వద్ద సరకును కొనేశారు. వీటిని రైతుల పేరిట చూపి మాయ చేశారు. ఇంత జరిగినా ఇటీవల వారం రోజుల కిందట కురిచేడుకు రెండు కేంద్రాలు కేటాయించారు. కొనుగోళ్లలో అసలు తంతును పక్కన పెట్టి మళ్లీ మళ్లీ కొత్త కేంద్రాలు కేటాయిస్తుండడం గమనార్హం. ఇక్కడ కూడా అసలైన రైతుల ఇళ్లల్లో కందుల నిల్వలు అనేకం ఉన్నాయి.

No comments:

Post a Comment