Breaking News

08/04/2019

కొబ్బరి బొ్ండాలకు పెరిగిన గిరాకీ

నెల్లూరు, ఏప్రిల్ 8, (way2newstv.in)
కొబ్బరి  బోండాలకు భారీగా గిరాకీ పెరిగింది. అకాల వర్షాలు, వేసవి తాపంతో కొబ్బరి బోండం ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం రెట్టింపయ్యాయి.అనారోగ్యంతో ఉన్న రోగులకు త్వరగా శక్తినిచ్చేందుకు వైద్యులు కొబ్బరినీరు తాగాలని సలహా ఇస్తారు. శరీరం నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగేందుకు పరుగులు తీస్తారు. ఖరీదు ఎంతైనా వెను కాడరు. లారీ కొబ్బరి బొండాలు ఆరుగురు వ్యాపారులు కలిసి తెచ్చుకుంటారు. గతేడాది వరకు రూ.25 నుంచి రూ.30 వరకు పలికిన కొబ్బరి బోండం ధర ప్రస్తుతం రూ.40కి చేరింది.


కొబ్బరి బొ్ండాలకు పెరిగిన గిరాకీ

ప్రతి వేసవిలో కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగిపోవడం సహజమే అయినా ఈ సారి మాత్రం ఊహించని విధంగా ధర పెరగిపోయింది. ఇతర రాష్ర్టాల నుంచి కొబ్బరి బొండాల దిగుమతి తగ్గడం వల్లనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. గూడూరులో సుమారు 20 దుకాణాలున్నాయి. గడియారం సెంటరు, వైద్యశాల వద్ద దుకాణాలున్నాయి. ఒక్క కొబ్బరికాయ రూ.10 నుంచి రూ.35వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో వ్యాపారి రోజుకు కనీసం 300 నుంచి 400 కొబ్బరికాయలు విక్రయిస్తుం టారు. సీజన్‌లో లీటరు కొబ్బరి నీరు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు

No comments:

Post a Comment