Breaking News

02/04/2019

అడుగంటిన సుంకేశుల రిజర్వాయర్

కర్నూలు, ఏప్రిల్ 2, (way2newstv.in): 
కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చే సుంకేసుల రిజర్వాయర్‌లో నీరు అడుగంటిపోయిం ది. సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు నీటిని తరలించి నగర ప్రజలకు సరఫరా చేయటం జరుగుతోంది. అయితే ఈ ట్యాంక్‌ను ఏర్పాటు చేసినప్పుడు నగర జనాభా 3 లక్షలు, ప్రస్తు తం 5.5 లక్షల జనాభా ఉంది. దీంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను నిండుగా నింపినా కేవలం 45 రోజుల వరకూ మాత్రమే నీరు సరిపోతుంది. 2వ సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి ఉంటే నగర ప్రజలకు నీటి ముప్పు ఉండేది కాదు. కాగా పాలక వర్గం మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ను ఏర్పాటు చేసి నగర ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం. దీంతో నగర ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు గత కొనే్నళ్లుగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు నెలకొనటంతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది.


అడుగంటిన సుంకేశుల రిజర్వాయర్

ప్రస్తుతం నగర వాసుల దాహార్తి తీర్చేందుకు మండల పరిధిలోని జి.సింగగవరంలోని దేవమ్మమడుగు నుంచి కెసి కెనాల్ ద్వారా సమ్మర్ స్టోరే జీ ట్యాంక్‌కు నీటిని తరలించి అక్కడ ఫిల్టరేషన్ చేసి సరఫరా చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి దేవమ్మమడుగు నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు నీటి ని తరలిస్తున్నట్లు నగర పాలక సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ నీళ్లు ఇంకా కేవలం 3 రోజుల వరకూ మాత్రమే సరిపోతాయని తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు నీరే నగర ప్రజలకు దిక్కుగా మారింది. నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజక్టుకు నీటిని తరలించి అక్కడి నుంచి ఉల్చాల మీదుగా కర్నూలు బ్రాంచ్ కెనాల్ ద్వారా సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు తరలించి అక్కడ ఫిల్టరేషన్ చేసి నగర వాసుల దాహార్తి తీర్చేందుకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రెండు, మూడు రోజుల్లోగా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిడిపి నుంచి నగరానికి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ఇటు అధికారులు, అటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment