Breaking News

25/04/2019

సూగూరులో నీటి ఎద్దడి…. నాలుగు రోజులుగా కుళాయి బంద్

మంత్రాలయం, ఏప్రిల్ 25, (way2newstv.in
కర్నూలు జిల్లా మంత్రాలయం  మండల పరిధిలోని సూగూరు గ్రామంలో నాలుగు రోజులుగా కొళాయి నీరు రాక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.  గ్రామశివారులోని చెరువులో పుష్కలంగా నీరు ఉన్నా కూడా గ్రామానికి నీరు అందించలేని పరిస్థితి. మోటర్ రిపేరు రావడంతో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నీరు ఎక్కడ తెచ్చుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఈ నెలలో చాలా మంచి మహుర్థాలు ఉన్నాయి..ఇలాంటి పెళ్లిళ్లు సీజన్లో తాగునీటి కష్టాలు ఏర్పడితే ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 


సూగూరులో నీటి ఎద్దడి…. నాలుగు రోజులుగా కుళాయి బంద్ 

మంచినీటి ట్యాంకర్ను  వేల రూపాయలు పెట్టి నీటిని  కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇంటికి తాగడానికి మంచినీటి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులలో అందులో పెళ్లిళ్ల సీజన్లో పెళ్ళివేడుకలకు  వేలాది రూపాయలు ఖర్చుపెట్టి మినరల్ వాటర్ ను కొనుక్కొని పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి వుంది. గ్రామ సర్పంచి పదవి కాలం ముగిసిపోవడం  ఇన్చార్జ్ ల పాలన ఉండడం  గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో ప్రజలకు అర్థం కాక మిన్నకుండిపోతున్నారు.సమస్యలను సర్పంచ్ ముందు ఉంచితే  నా పదవి కాలం అయిపోయింది అంటాడు. పంచాయతీ సెక్రెటరీ అయితే నిధులు లేవు అంటారు. ఇక గ్రామాలలో పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ ఇలాంటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు . ఒక్క సూగూరు  గ్రామంలోనే కాక మంత్రాలయం మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి .ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

No comments:

Post a Comment