Breaking News

13/04/2019

సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా

విశాఖపట్టణం,ఏప్రిల్ 13, (way2newstv.in
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటు దృష్టితో కానీ మరో కారణం కానీ.. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఏపీలోని అరవై ఆరు శాతం కుటుంబాలు ప్రభుత్వ పథకాల లబ్ది పొందాయి. ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి పడ్డాయా..? అంటే.. ఆలోచించాల్సిన పరిస్థితే. ఎందుకంటే.. పథకాల లబ్దిదారులంతా.. ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడూ ఓటు వేయరు. అందులోనూ అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఏపీలోనూ అదే జరిగి ఉంటుంది. అయితే ప్రభుత్వాలు కూడా.. తమ పథకాల వల్ల లబ్ది కలుగుతుంది కాబట్టి మొత్తం తమకే ఓటు వేయాలని కోరుకోరు. వారి లక్ష్యం.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లలో చీలిక తీసుకు రావడమే. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిలో ఓ పదిశాతం అయినా మార్పు తీసుకు వస్తే వచ్చే ఫలితం తేడాగా ఉంటుంది. 


సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా

అందుకే.. ఓ ప్లాన్ ప్రకారం.. అధికారపార్టీ… సంక్షేమ ఫలాల వరద పారించింది. తెలంగాణ సర్కార్ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను గట్టిగానే మార్చింది. దాదాపుగా.. 30 శాతానికిపైగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గారు. ఇక పెన్షన్ పెంచుతామని హామీని మాత్రమే టీఆర్ఎస్ ఇచ్చింది. కానీ.. ఏపీ సర్కార్.. పెంచి మరీ ఎన్నికలకు వెళ్లింది. ఇది నేరుగా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా వైసీపీ సానుభూతి పరుల ఓట్లు కూడా కొన్ని టీడీపీకి పడ్డాయి. ఓటు బ్యాంక్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలో.. వైసీపీ సక్సెస్ అయినప్పటికీ పథకాల కారణంగా నేరుగా అందిన డబ్బుతో.. వైసీపీ కొంత నష్టపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది.. అంత తీవ్ర స్థాయిలో ఉన్న సూచనలేమీ కనిపించలేదు. వాస్తవానికి తెలంగాణలో అభ్యర్థులకు.. ఎదురైన వ్యతిరేకత అంతా ఇంతాకాదు. అయినప్పటికీ.. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయాలు నమోదు చేశారు. అదంతా ప్రభుత్వ పథకాల ప్రభావమే. ఏపీలో ఆ వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు.. సమర్థంగా నడిపారన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. అదే సమయంలో ఆ పేరుతో సంక్షేమానికి కోత పెట్టలేదు. ఈ పరిస్థితి పోలింగ్ సరళిలో బయటపడిందని కొంత మంది అంటున్నారు.

No comments:

Post a Comment