Breaking News

20/04/2019

రికార్డు స్థాయి ధరలో ఎండు మిర్చి

ఖమ్మం, ఏప్రిల్ 20, (way2newstv.in)
తేజారకం ఎండుమిర్చికి  ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాకు ఒక్కంటికి రూ 1,000 పెరగడంతో మార్కెట్‌కు పంటను తీసుకవచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్ వస్తున్న పంట ఉత్పత్తులలో రెండు లేదా మూడో సారి తీసిన పంట ఎక్కువ మొత్తంలో వస్తుంది. మొదటి కాపునకు సంబంధించిన పంటను ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి అయ్యే తేజరకం పంటకు మంచి డిమాండ్ రావడంతో పంటకు అధిక ధర వస్తుందని ఖరీదుదారులు, అధికారులు పేర్కొంటున్నారు. 


రికార్డు స్థాయి ధరలో ఎండు మిర్చి

తెలంగాణ వ్యాప్తంగా తేజరకం సాగు చేస్తున్న జిల్లాలలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని కొంత ప్రాంతంలోనే తేజరకం మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. సీజన్ ఆరంభంలో ఈ రకం పంటకు కొంత తక్కువ ఆదరణ రావడంతో సాగు రైతులు ఆయా ప్రాంతాలలో ఉన్న శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకోవడం జరిగింది. మరి కొందరు రైతులు ఇండ్లలోనే నిల్వ చేసుకున్నారు. అయితే గత పక్షం రోజుల క్రితం క్వింటా ఒక్కంటకి రూ 8,500 మాత్రమే ధర పలికింది. అనంతరం వారం రోజుల నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ క్వింటా ఒక్కంటికి గరిష్ట ధర రూ 10,050 కి చేరుకోవడంతో అటు అధికారులు, ఇటు పంటను తీసుకవచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మార్కెట్‌లో జరిగిన జెండాపాట లో గరిష్ట ధర క్వింటాకు రూ 10,050 పలికిం ది. మధ్య ధర రూ8,800పలుకగా, కనిష్ట ధ ర రూ 7,200 చొ ప్పున పలికిం ది. అదే విధంగా తా లు రకం పం ట కు క్వింటాకు ఒ క్కంటికి గరిష్ట ధ ర రూ 4వేలు ప లుకగా, కనిష్ట ధ ర రూ 3వేలు చొ ప్పున ధర ని ర్ణ యించి మిర్చి ఖ రీదుదారులు కొ నుగోలు చేశా రు. ఏది ఏమైన ఈ సంవత్సరం అనేక వైరస్‌ల కా రణంగా దిగుబడి తగ్గినప్పటికీ మా ర్కెట్లో పంట కు మంచి ధర ప లుకుతుండటం తో మిర్చి సాగు కలిసి వచ్చినైట్లెంది

No comments:

Post a Comment