Breaking News

23/04/2019

డిమాండ్ కు తగిన సాగు...

విజయవాడ, ఏప్రిల్ 17, (way2newstv.in)
డిమాండ్ మేరకే పంటలు సాగు చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.  ఒక్కోసారి ధర అమాంతం పెరగడం, తరువాత పడిపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏ పంటకు ఏమేరకు డిమాండ్ ఉంది? అనేదాన్ని పరిగణనలోకి తీసుకుని వివిధ పంటల విస్తీర్ణాన్ని నియంత్రించడం వల్ల రైతులు నష్టపోకుండా చూడవచ్చనే ఆలోచనతో సర్కార్ అడుగులు వేస్తోంది.పంటల దిగుబడులకు అనుగుణంగా కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మించడం కూడా సమస్యగా మారుతోంది. ఉన్న గిడ్డంగులను కొందరు బడా రైతులే తమ చేతుల్లో ఉంచుకుని చిన్న, సన్నకారు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న రైతు తన పంటను కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకునేందుకు వెళ్తే ఖాళీ లేదని వస్తున్న సమాధానం మింగుడుపడటం లేదు. కొన్నిచోట్ల అదనపు ధర చెల్లిస్తే గిడ్డంగుల్లో దాచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


డిమాండ్ కు తగిన సాగు...

డిమాండ్ మేరకు గిడ్డంగులు వెంటనే నిర్మించాలంటే నిధుల కొరత సమస్యగా మారుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకే వివిధ పంటలను సాగుచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందిఇటీవలి కాలంలో మిర్చి రైతు, తాజాగా పసుపు రైతుల పరిస్థితిని గమనించి ఈ దిశగా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. రైతులకు మేలుచేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది మిర్చి రైతుకు టన్నుకు దాదాపు 10 వేల రూపాయల వరకూ ధర లభించడంతో ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగుచేశారు. ఆ మేరకు దిగుబడి కూడా పెరిగింది. కానీ వివిధ కారణాల వల్ల మిర్చి ధర అమాంతం పడిపోయింది. కనీసం 5 వేల రూపాయల ధర కూడా లభించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రంగంలోకి దిగి మార్క్‌ఫెడ్ ద్వారా కొనాలని రైతులు కోరుతున్నా ఇప్పటికీ మిర్చి రైతు సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా పసుపు రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఉల్లి, నిమ్మికాయల రైతులు వివిధ కారణాల వల్ల ధర పడిపోవడంతో కుదేలయ్యారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంతమేర రైతులను నష్టాల నుంచి గట్టెక్కించింది. సీజనులో టమాటా, తదితర పంటల పరిస్థితి కూడా ఇలానే ఉంటోంది. ఒక్కోసారి కిలో టమాటా ధర 50 రూపాయలకు చేరుతోంది. ఒక్కోసారి 50 పైసలకు పడిపోతోంది. పెట్టుబడులు కూడా తిరిగి రాక పంటను చేనులోనే వదిలేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అరటి, తదితర రైతులు రవాణా చార్జీలు కూడా లభించక యార్డుల్లోనే తమ ఫలసాయాన్ని వదిలివెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

No comments:

Post a Comment