Breaking News

13/04/2019

అకాల వర్షం వల్ల రైతులు అతలాకుతలం

ఖమ్మం, ఏప్రిల్ 13  (way2newstv.in)   
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యబంజర్ శివాలయం వద్ద ఉన్న ఐకెపి సెంటర్ లో రాత్రి అకాల వర్షానికి ధాన్యం భారీ ఎత్తున తడిసి వరదకి మేటలు పెట్టాయి.  పుల్లయ్యబంజర్ ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో సుమారు నాలుగైదు గ్రామాల నుండి దాన్యం అధిక మొత్తంలో రావడంతో ఒక లక్షా 40 వేల బ్యాగులు అవసరముందని రైతులు తెలిపారు. దీంతో ధాన్యం సేకరణ పూర్తిగా ఆగిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు. 


అకాల వర్షం వల్ల రైతులు అతలాకుతలం

ఖమ్మం నుండి లారీలు రోజుకు రెండు మూడు మాత్రమే పంపిస్తున్నారని వేల బస్తాలు ధాన్యం ఇక్కడ నిల్వ ఉన్నాయని దీంతో అకాల వర్షానికి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం అని , వారి నిర్లక్ష్యం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు గోడు వెల్లగక్కారు. దీనికి తోడు అదనంగా రైతుపై మోకు కట్టడానికి 300 రూపాయలు ఇవ్వాల్సిందని లేకపోతే ధాన్యము  కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలిపారు. రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని కొనుగోలు కేంద్రానికి వచ్చిన సివిల్ సప్లై  డి.టి.సురేందర్ మాట్లాడుతూ రెండు మూడు రోజులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ధాన్యం మొత్తం కొనుగోలు  చేస్తామని అన్నారు. గతంలో కల్లూరు మిల్లు కూడా సప్లై చేశామని బోయిల్డ్ మిల్స్ లేకపోవడంతో , ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్న వాటికి ఇవ్వడం జరిగిందని తెలిపారు.రైతుల దగ్గర నుండి 300 రూపాయలు వసూలు చేసే విషయం ఇప్పుడే న దృష్టికి తెచ్చారని అధికారులు తో,కాంట్రాక్టర్తో మాట్లాడుతనని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు.  ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి రైతుల కంట కన్నీరు రాకుండా చూడాలని వెంటనే మొత్తం ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటుంన్నారు.

No comments:

Post a Comment