Breaking News

29/04/2019

మద్యం ధరలపై కొరడా

ఏలూరు, ఏప్రిల్ 29, (way2newstv.in)
పోలింగ్‌ తర్వాత ఎమ్మార్పీ ఉల్లంఘనలపై కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల పరిధిలో మొత్తం 470 వరకూ దుకాణాలు ఉన్నాయి. బార్లు మొత్తం 40 వరకూ ఉన్నాయి. జిల్లాలో అధికారపార్టీకి చెందిన వారే మద్యం వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, స్వయంగా ఆ శాఖ మంత్రి జిల్లావాడు కావడం, ఆయన ముఖ్య అనుచరులే సిండికేట్లకు నాయకత్వం వహించడంతో అనధికారికంగా మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచి మద్యంవ్యాపారులు అమ్ముకుంటున్నారు.  ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అబ్కారీ అధికారులే మౌఖిక ఆదేశాలు జారీ చేయడం  గమనార్హం.  ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలకు సంబంధించి గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పాటించకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మద్యం ధరలపై కొరడా

తక్షణమే వారం పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఉల్లంఘనులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. బెల్ట్‌షాపులు, పర్మిట్‌ రూమ్‌ల పేరుతో జరుగుతున్న దందాలపై కూడా దృష్టి పెట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. పర్మిట్‌ రూమ్‌ అంటే లోపల మద్యం కొనుకున్నవాడు తాగి వెళ్లిపోవాలి. వసతులేమీ ఉండకూడదు. అయితే పర్మిట్‌ రూమ్‌ల పేరుతో అనుమతి తీసుకుని బార్లను తలపించేలా సిట్టింగ్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నారు.  ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కొత్త సంస్కృతికి అధికార పార్టీ నేతలు తెరలేపారు. బెల్ట్‌షాపులకు అనుబంధంగా దాబాలను ఏర్పాటు చేశారు. గోపన్నపాలెంలో షాపునకు అనుబంధంగా కల్యాణమండపం అద్దెకు తీసుకుని దాన్ని పర్మిట్‌రూమ్‌గా మార్చేశారు. పక్కన ఒక దాబా. దుగ్గిరాల బైపాస్‌ వద్ద ఒక దాబాలో సిట్టింగ్‌ బెల్ట్‌షాపు, చింతలపూడి బైపాస్‌లో దాబా కూడా బెల్ట్‌షాపులా నడుస్తోంది. ఏలూరు చుట్టుపక్కలగ్రామాల్లో బెల్ట్‌షాపులతోపాటు దాబాల ను అక్కడి ప్రజాప్రతినిధి ఏర్పాటు చేయించారు. జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో దాదాపుగా సిట్టింగ్‌ రూములు ఉన్నాయి. అర్ధరాత్రి కూడా దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇక్కడ మద్యం క్వార్టర్‌పై అదనంగా రూ. 30 నుంచి రూ. 50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. పోలీసులకు, ఎక్సైజ్‌ శాఖకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటం వల్లే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ఉల్లంఘన, అర్ధరాత్రి అమ్మకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం దుకాణాల వేళలపై కొంత నియంత్రణ ఉంది. ఉదయం ఆరు గంటలకు తీసి రాత్రి 12 గంటల వరకూ నడిచేవి. అయితే ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నడుస్తున్నాయి.ఎమ్మార్పీ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకుæ అధికారులు రంగంలోకి దిగారు. వారంపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు ఎస్టీఎఫ్‌ బృందాలు సం యుక్తంగా కలిసి దాడులు చేయబోతున్నాయి. ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే షాపుల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తారు. విచారణ తర్వాత శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు.

No comments:

Post a Comment