గోధుమ రొట్టె కంటే బెటర్
వేసవి సీజన్‌లో మనకు ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ప్రథమ స్థానంలో ఉంటుంది. వీటిని ఈ సీజన్‌లో తినడం చాలా మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ నడుమ లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ నడుమ ఉండే సమయంలో మామిడి పండ్లను తినవచ్చు. దీంతో ఎలాంటి సమస్యా రాదు. షుగర్ లెవల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. సాధారణంగా మామిడి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారాన్ని మనం తిన్న తరువాత అది రక్తంలో ఎంత సేపటికి కలిసి గ్లూకోజ్ గా మారుతుంది, ఎంత సేపటికి షుగర్ లెవల్స్ ను ప్రభావితం చేస్తుంది అనే ఓ కొలత.
మామిడితో ఎన్నో పోషకాలు
ఇది మామిడి పండ్లకు 100కు 56గా ఉంటుంది. అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ జాబితా ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువే. కనుక మధుమేహం ఉన్న వారు నిర్భయంగా మామిడి పండ్లను తినవచ్చు. అయితే వాటిని పైన చెప్పిన సమయాల్లో తింటేనే షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు..!ఎన్నో పోషకాలు మనకు లభిస్తాయి. శరీరానికి శక్తి అంది ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా ఎవరైనా మామిడిపండ్లను తినవచ్చు కానీ డయాబెటిస్ ఉన్న వారు మాత్రం మామిడి పండ్లను తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే మామిడి పండ్లను తింటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయని వారు భావిస్తారు. అయితే ఇది నిజమేనా..? అసలు మధుమేహం ఉన్న వారు మామిడి పండ్లను తినవచ్చా, తినరాదా..? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాధారణ సైజ్ ఉన్న మామిడి పండు ద్వారా లభించే క్యాలరీలు, ఒకటిన్నర గోధుమ రొట్టెతో లభించే క్యాలరీలకు సమానం. కనుక మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చు. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే మాత్రం మామిడి పండ్లను తినరాదు. ఎందుకంటే భోజనం వల్ల అప్పటికే రావల్సినన్ని క్యాలరీలు మనకు లభిస్తాయి. ఈ క్రమంలో వెంటనే మామిడి పండును తింటే దాంతో లభించే క్యాలరీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి. దీనికి తోడు రక్తంలో షుగర్ లెవల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి.
No comments:
Post a Comment