Breaking News

04/04/2019

ఎవ్వరికి అందని ప్రజా నాడి

విజయవాడ, ఏప్రిల్ 5(way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి మాత్రం ఎవరూ పట్టలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేవ్ ఉందని, ఆ పార్టీ భారీ విజయం సాధిస్తుందని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అయితే, ఇటీవల ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగిందని, మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పసుపు – కుంకుమ, పింఛన్లు పెంపు తెలుగుదేశం పార్టీకి కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయ. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.గతంలో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉందనే అంచనాల నేపథ్యంలో ఆయన అన్ని అస్త్రాలనూ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. 


ఎవ్వరికి అందని ప్రజా నాడి

ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెండు నెలల క్రితం డ్వాక్రా మహిళల ఓట్లను ఆకట్టుకునే వ్యూహంతో పసుసు – కుంకుమ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రతీ డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 60 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారి ఈ డబ్బు ఇచ్చే పరిస్థితి లేనందున ఆయన నాలుగు దఫాలుగా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఒక్కసారే పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు ఇచ్చేశారు. కొన్ని చోట్ల తమకు ఓట్లేస్తామని ప్రమాణాలు కూడా చేయించుకున్నట్లు వార్తలొచ్చాయి.అయితే, పసుసు – కుంకుమ పథకంలో ఇప్పటికే రెండు విడతల డబ్బులు డ్వాక్రా మహిళలకు అందాయి. మూడో విడత ఈ నెల 6 నుంచి ఇవ్వనున్నారు. అంటే ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు మాత్రమే ఈ డబ్బులు డ్వాక్రా మహిళల చేతికి అందనున్నాయి. ఇది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. తమకు డబ్బు ఇచ్చారు కదా అని డ్వాక్రా మహిళలు ఆలోచిస్తే టీడీపీకే ఓటేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోసమే, తమ ఓట్ల కోసమే డబ్బు ఇచ్చారని ఆలోచిస్తే మాత్రం వారికి ఇష్టమున్న వారికి ఓట్లేయవచ్చు. అయితే, పసుపు – కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళల ఓట్లు గంపగుత్తాగా తమ ఖాతాలో పడినట్లే అని తెలుగుదేశం నమ్మకం పెట్టుకుంది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఇప్పుడు ఎన్నికల కోసం ప్రలొభపెట్టేందుకే పసుసు – కుంకుమ తీసుకువచ్చారని, చంద్రబాబును నమ్మవద్దని ప్రచారం చేస్తోంది. మరి, ఈ నెల 6వ తేదీన తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి

No comments:

Post a Comment