విశాఖపట్టణం,ఏప్రిల్ 8(way2newstv.in)
ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలూ టీడీపీకి బాగా పట్టున జిల్లాలు. ఇక కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారాక విశాఖ అర్బన్ జిల్లా కూడా టీడీపీ వైపుగా నడుస్తూ వచ్చింది.కాంగ్రెస్ లో బలమైన నేతలు టీడీపీలో చేరడం, విభజన పాపాలు అన్నీ కలసి హస్తం పార్టీ పుట్టె ముంచేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు అందరినీ సైకిలెక్కించేసి టీడీపీ రాజకీయంగా బాగా లాభపడింది. 2014 ఎన్నికల్లో విశాఖ ఏజెన్సీ తప్ప అంతా టీడీపీ స్వీప్ చేసేసింది. అయిదేళ్ళ తరువాత అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.విశాఖ రూరల్ జిల్లాలో ఫలానా సీటు వైసీపీ గెలుస్తుందని గట్టిగా చెబుతున్నా అర్బన్ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క భీమిలి తప్ప మిగిలిన చోట్ల టీడీపీ వైసీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక విశాఖ పశ్చిమం, విశాఖ తూర్పు నియోజకవర్గాలు అయితే టీడీపీకి పెట్టని కోటలు అంటున్నారు. మొదటి ఫలితం ఇక్కడ నుంచే టీడీపీకి అనుకూలంగా వస్తుందని కూడా అంటున్నారు. ఇక మిగిలిన సీట్లు చూసుకుంటే గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ కారణంగా అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. దాంతో అక్కడ టైట్ ఫైట్ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఉత్తరాంధ్ర..ఎటు వైపు...
విశాఖ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ అభ్యర్ధిగా మూడవసారి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రభంజనం అన్నది రూరల్ దాటి సిటీకి రావడంలేదని అంటున్నారు. అయితే అండర్ కరెంట్ గా సైలెంట్ వేవ్ ఉందని, అది కనుక బలంగా వీస్తే అభ్యర్ధులు ఎవరు, ప్రత్యర్ధులు ఎవరు అన్నది కూడా చూడకుండా ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటేస్తారని అంటున్నారు. ఆ ప్రభంజనం ముందు అటు తూర్పులో రామక్రిష్ణ బాబు, ఇటు పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు ఇద్దరూ ఓడిపోతే మొత్తం సీట్లు వైసెపీ పరం అవుతాయని అంటున్నారు.విశాఖ జిల్లాలో హాట్ సీటు గా పేరున్న ఉత్తరం అసెంబ్లీలో రాజకీయాలు చరమాంకానికి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్ధులుగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వైసీపీ నుంచి కేకే రాజు ఉన్నారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ మధ్య ప్రధానమైన పోరు అని భావించిన అది వైసీపీ వర్సెస్ టీడీపీగా మారుతోంది. మొదట్లో ఇక్కడ నెమ్మదిగా ఉన్న వైసీపీ ఇపుడు చురుగ్గా పావులు కదుపుతోంది. దాంతో మంత్రి కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడుతోంది.ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ బలమైన పార్టీ నేతలకు గేలం వేయడం అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చేయడం ద్వారా మైండ్ గేం ఆడుతున్నాయి. జనసేన టికెట్ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ నేత గుంటూరు నరసింహమూర్తి, ఆయన భార్య గత ఎన్నికలో కాంగ్రెస్ తర ఫున పోటీ చేసిన గుంటూరు భారతిలను వైసీపీ లాగేసింది. నిజానికి వారికి గంటా గేలం వేశారట. అయితే వైసీపీ తెలివిగా పావులు కదిపి లాగేసుకుంది. దీంతో గంటా మాస్టర్ మైండ్ ఉపయోగించి ఏకంగా వైసీపీలోని సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ని తన వైపుకు తిప్పుకున్నారు. ఈ పరిణామతో బిత్తరపోవడం వైసీపీ వంతు అయింది.ఇక తైనాల విజయకుమార్ చివరి వరకూ వైసీపీ వైపు ఉన్నారు. ఆయనను పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చి ప
No comments:
Post a Comment